ఎనిమిదేళ్లుగా ఓకే షర్ట్ వాడుతున్న రామ్ చరణ్.. అతని సింప్లిసిటీ కి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే!

ఎనిమిదేళ్లుగా ఓకే షర్ట్ వాడుతున్న రామ్ చరణ్.. అతని సింప్లిసిటీ కి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే!

by Harika

రామ్ చరణ్ ఒకప్పుడు మెగాస్టార్ చిరంజీవి కొడుకు కానీ ఇప్పుడు గ్లోబల్ స్టార్ అయ్యాడు. తండ్రి పరంగా సంక్రమించిన ఆస్తి కాకుండా తన సంపాదించుకున్న ఆస్తి మాత్రమే కొన్ని కోట్లలో ఉంటుంది అయినప్పటికీ రామ్ చరణ్ చూపించే సింప్లిసిటీ చూస్తే నిజంగా హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. నిజానికి అంత స్టార్ హీరోలు తల వెంట్రుక దగ్గర నుంచి కాళ్లకు వేసుకునే షూ వరకు అన్ని బ్రాండెడ్ వి అలాగే లక్షలు ఖరీదు చేసేవి ఉంటాయి.

Video Advertisement

తర్వాత అవి మళ్ళీ వేసుకున్నట్లు ఎక్కడా కనిపించదు. అయితే రామ్ చరణ్ మాత్రం ఒక షర్ట్ ని ఎనిమిది సంవత్సరాలుగా వేసుకుంటూనే ఉన్నాడు. రీసెంట్ గా రామ్ చరణ్ దర్శకుడు బుచ్చిబాబుతో కలిసి దిగిన ఫోటోలు బయటకు వచ్చాయి. ఆ ఫోటోలో రామ్ చరణ్ గ్రీన్ గ్రే కలర్ చెక్స్ షర్ట్ వేసుకొని కనిపించారు. ఆ తర్వాత కూడా ఆ షర్ట్ చాలా సార్లు వేసుకున్నట్లు గమనించారు ఫ్యాన్స్.

2016 నుంచి 2024 వరకు ఆయన ఆ షర్ట్ ధరించిన ఫోటోలన్ని ఒక దగ్గర చేర్చి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు నెటిజన్స్. 2016లో ధ్రువ సినిమాలో ఈ షర్ట్ ని ధరించారు చెర్రీ. ఆ తర్వాత ఆర్ఆర్ఆర్ షూటింగ్ సమయంలోను, ప్రమోషన్స్ సమయంలో కూడా అదే షర్ట్ తో కనిపించారు. అలాగే లాక్ డౌన్ సమయంలో కూడా అదే షర్ట్ ని చాలాసార్లు వేసుకొని కనిపించారు రామ్ చరణ్. పదేపదే పదే షర్టుతో చరణ్ కనిపిస్తూ ఉండటంతో ఆ షర్ట్ అంటే చెర్రీకి ఎంత ఇష్టమో అర్థమవుతుంది.

https://www.instagram.com/p/C1tou77pDaz/

ఇక ప్రస్తుత విషయానికి వస్తే ఈ మధ్యనే ఒక ఆడపిల్లకి తండ్రిగా మారి ఒక తండ్రిగా జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్న రామ్ చరణ్ ఇప్పుడు గేమ్ చేంజర్ సినిమాలో తెగ బిజీగా ఉన్నాడు. ఏది ఏమైనాప్పటికీ రామ్ చరణ్ సింప్లిసిటీ కి ఫిదా అవుతున్నారు ఆయన అభిమానులు.


You may also like

Leave a Comment