Ads
‘ఆర్ ఆర్ ఆర్’ తర్వాత రామ్ చరణ్ శంకర్ దర్శకత్వంలో ‘ఆర్సీ15’ ప్రాజెక్ట్‌లో నటిస్తున్నాడు. దాని తర్వాత గౌతమ్ తిన్ననూరి తో సినిమా ఉండేది.. కానీ ఆ చిత్రం ఆగిపోయినట్లు రాంచరణ్ టీం ప్రకటించింది. దీంతో రామ్ చరణ్ తదుపరి సినిమా ఏంటి.. అని అభిమానుల్లో చర్చలు మొదలయ్యాయి. ఈ నేపథ్యం లో రామ్ చరణ్ నెక్ట్స్ ప్రాజెక్ట్ గురించి క్రేజీ అప్డేట్ వెలుగులోకి వచ్చింది.
Video Advertisement
కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన ‘బింబిసార’ మూవీ ఈ ఏడాది విడుదలై.. బ్లాక్ బాస్టర్ హిట్‌గా నిలిచింది. దీనికి వశిష్ట దర్శకత్వం వహించారు. బింబిసార మూవీతో వశిష్ట క్రేజీ డైరెక్టర్లలో ఒకడిగా మారిపోయాడు. మూవీని వశిష్ట ట్యాకిల్ చేసిన తీరుపై పెద్ద ఎత్తున ప్రశంసలు లభించాయి. దాంతో టాలీవుడ్‌లోని క్రేజీ డైరెక్టర్ల జాబితాలో చేరిపోయిన వశిష్ట.. ఇటీవల రామ్ చరణ్‌కి ఓ స్టోరీ లైన్ చెప్పాడట. అది నచ్చడంతో పూర్తి స్క్రిప్ట్‌ని సిద్ధం చేయాలని సూచించినట్లు టాలీవుడ్లో టాక్ వినిపిస్తోంది.
వశిష్టకి ‘బింబిసార’ ఫస్ట్ మూవీనే. మరోవైపు రామ్ చరణ్ ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో పాన్ ఇండియా హీరోగా ఎదిగిపోయాడు. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య సినిమా అనగానే అందరూ ఆశ్చర్యపోతున్నారు. శంకర్ సినిమా తర్వాత రామ్ చరణ్ ఓ ఫాంటసీ డ్రామా చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. దాంతో వశిష్ట చెప్పిన ఫాంటసీ డ్రామా లైన్ నచ్చడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
రామ్ చరణ్‌కి ఇటీవల ‘ఉప్పెన’ డైరెక్టర్ బుచ్చిబాబు కథ చెప్పాడు. అలానే సీనియర్ డైరెక్టర్ సుకుమార్ కూడా రామ్ చరణ్‌తో సినిమా కోసం స్టోరీని సిద్ధం చేసినట్లు వార్తలు వస్తున్నాయి. మరి ‘ఆర్సీ 16’ ని రామ్ చరణ్ ఏ డైరెక్టర్‌కి ఛాన్స్ ఇస్తాడో చూడాలి.
End of Article