ప్రముఖ దర్శకులు రామ్ గోపాల్ వర్మ కి శ్రీదేవి గారు అంటే ఎంత ఇష్టమో మనందరికీ తెలుసు. శ్రీదేవి గారితో క్షణక్షణం, గోవిందా గోవిందా సినిమాలు చేశారు రామ్ గోపాల్ వర్మ. ఈ సినిమాలు రామ్ గోపాల్ వర్మకి మాత్రమే కాకుండా శ్రీదేవి గారికి కూడా ఎంతో మంచి పేరు తీసుకొచ్చాయి. ఎన్నో సందర్భాల్లో రామ్ గోపాల్ వర్మ కూడా తాను శ్రీదేవికి అభిమానిని అని, ఆమె అందానికి భక్తుడిని అని చెప్పారు.rgv about sridevi

అయితే, రామ్ గోపాల్ వర్మ ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో శ్రీదేవిని ఆయనకు భార్యగా పొందే అవకాశం మిస్ అయ్యింది అని అన్నారట. సమయం కథనం ప్రకారం, రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ, “గోవిందా గోవిందా షూటింగ్ చేస్తున్నప్పటికే శ్రీదేవి టాప్ హీరోయిన్ గా ఉన్నారు. ఆ సమయంలో శ్రీదేవి టాక్స్ సమస్యలతో ఇబ్బంది పడ్డారు. అంతే కాకుండా కుటుంబపరమైన సమస్యలు, అలాగే తన సోదరితో కూడా సమస్యలు ఎదురయ్యాయి.rgv about sridevi

అప్పుడు శ్రీదేవి ఒక రోజు నన్ను ప్రైవేట్ గా కలిసి మాట్లాడారు. అంతకు రెండు నెలల ముందే నేను నా భార్యతో విడిపోయాను. ఒకవేళ శ్రీదేవి నాతో ఆ రోజు షేర్ చేసుకున్న విషయాలని బట్టి నేను తనని ప్రపోజ్ చేసి ఉంటే కథ వేరే లాగా ఉండేది. కానీ నేను తనని ప్రపోజ్ చేయలేదు. అందుకు రెండు కారణాలున్నాయి. ఒకటి శ్రీదేవి అంటే నాకు చాలా ఆరాధన భావన ఉంది. రెండవ కారణం నా లైఫ్ లోకి ఊర్మిళ రావడం” అని చెప్పారట రామ్ గోపాల్ వర్మ.