Ads
సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న గుంటూరు కారంలోని సెకండ్ సాంగ్ ఓ మై బేబీ పైన సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్స్ జరుగుతున్నాయి. మహేష్ బాబు ఫ్యాన్స్ కి ఈ సాంగ్ అస్సలు నచ్చలేదు. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కి వ్యతిరేకంగా ట్విట్టర్ లో ట్రెండ్ సృష్టించారు.
Video Advertisement
అసలు ఇదేం పాట ఇంగ్లీష్ లిరిక్స్ ఏంటి అంటూ కూడా నెగిటివ్ కామెంట్లు పెట్టారు. దీనిపైన ఈ పాట రాసిన రైటర్ రామజోగయ్యా శాస్త్రి స్పందించారు. ఫ్యాన్స్ పైన ఆయన మండిపడుతూ ఒక లెటర్ ని కూడా విడుదల చేశారు. విమర్శలు సరిగ్గా చేయండి ఎవరిష్టం వచ్చినట్లు వారు కామెంట్లు పెట్టడం సరికాదు అంటూ స్పందించారు. దీనికి పలువురు సినీ విమర్శకులు తిరిగి కామెంట్లు చేశారు.
సినిమా మేకర్స్ ఎప్పుడూ కూడా అభిమానులకు నచ్చే విధంగా పనిచేయాలని అభిమానులకు నచ్చకపోతే వారిని తప్పు పట్టకూడదు అంటూ తిరిగి కౌంటర్లు వేస్తున్నారు. అయితే రామజోగయ్యశాస్త్రి మాట్లాడుతూ… గుంటూరు కారం కోసం మరో పాట పైన పని చేస్తున్నామని ఏం చేసినా కూడా పాట బాగుండాలనే ప్రయత్నిస్తామంటూ సర్ది చెప్పుకొచ్చారు. మిగతా పాటలైనా సరే మంచి పాటలు ఇవ్వాలంటూ మహేష్ అభిమానులు విజ్ఞప్తి చేస్తున్నారు. అయితే దీని పైన మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఇప్పటివరకు స్పందించలేదు
End of Article