నటి రమాప్రభ గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. ఈమె చాలా సినిమాల్లో నటించి అందరిని మెప్పించారు. తెలుగులో మాత్రమే కాకుండా తమిళ్ భాషలో కూడా ఈమె కమెడియన్ గా ఎన్నో చిత్రాల్లో నటించారు. రమాప్రభ శరత్ బాబు ని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.

Video Advertisement

తర్వాత ఆమె అతని కారణంగా మోసపోయింది… సంపాదించుకున్న ఆస్తి మొత్తాన్ని కూడా రమప్రభ పోగొట్టుకుంది. ఆఖరికి ఆమె ఏమీ లేక కట్టుబట్టలతో రోడ్డు మీద పడింది.

అటువంటి పరిస్థితుల్లో రజినీకాంత్ ఆమెని ఆదుకున్నారట. రజనీకాంత్ అప్పుడు ఆమెని కాపాడారని చెప్పింది రమాప్రభ. అయితే అప్పట్లోనే తన దగ్గర ఉన్న 40 వేల రూపాయలని ఆయన ఆమెకి ఇచ్చేసారట. తిండి కోసం దారి ఖర్చుల కోసం డబ్బులు ఇవ్వమని రమాప్రభ రజినీకాంత్ ఇంటికి వెళ్తే.. ఆయన ఒకేసారి అంత డబ్బులు ఇవ్వడం రమాప్రభ కి షాకింగ్ గా అనిపించిందట.

ఇప్పుడు కూడా రజినీకాంత్ అందరికీ ఈ విధంగానే సహాయం చేస్తారని రమాప్రభ చెప్పారు. అయితే రమాప్రభ తిండి తినడానికి ఏమీ లేక పస్తులు ఉంటుందని వివిధ రకాలుగా వార్తలు వచ్చాయి. కానీ వాటిలో ఏమాత్రం నిజం లేదని రమాప్రభ అన్నారు. చాలా మంది తప్పుడు ప్రచారం చేస్తున్నారని… అడుక్కుతింటున్నానని అందరూ అంటున్నారు.. కానీ అది నిజం కాదని ఆమె అన్నారు. అలానే తన సొంత యూట్యూబ్ ఛానల్ లో ఇల్లుని కూడా చూపించారు.

ఇంత బిజీగా పని లో ఉంటున్నప్పుడు ఎలా అడుక్కు తింటాను అంటూ రమాప్రభ చెప్పారు. ఇప్పటికి కూడా నాగార్జున పూరి వంటి వాళ్ళు సహాయం చేస్తున్నారని కూడా ఆమె చెప్పారు. సో ఇది కూడా అడుక్కుతింటున్నట్లు కాదని రమా ప్రభ చెప్పారు. పైగా నా మీద ప్రేమతో మళ్ళీ ఇస్తున్నారు ఇది అడుక్కుతింటున్నట్లు కాదు. ప్రేమగా ఇస్తున్నారు కాబట్టి నేనే అందరికంటే ధనవంతురాలిని అని భావిస్తున్నానని రమాప్రభ చెప్పారు.