ప్రముఖ నటుడు సూపర్ స్టార్ కృష్ణ గారు ఆరోగ్య సమస్యల కారణంగా ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. గ‌తేడాది కృష్ణ పెద్ద కుమారుడు ర‌మేష్ బాబు అనారోగ్యంతో క‌న్నుమూసిన సంగ‌తి తెలిసిందే. కాగా తాజాగా కృష్ణ మొద‌టి భార్య, మ‌హేశ్ బాబు త‌ల్లి ఇందిరా దేవి సైతం అనారోగ్యం తో క‌న్నుమూశారు.

Video Advertisement

ఇందిరాదేవి గారు చనిపోయిన కొద్ది రోజులకే కృష్ణ గారు కూడా చివరి శ్వాస విడిచారు. సూపర్ స్టార్ కృష్ణ మరణ వార్త తో దేశంలోని సినీ, రాజకీయ ప్రముఖులంతా కూడా దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు.

famous personalities died in 2022

అయితే సూపర్‌ స్టార్‌, నట శేఖర కృష్ణ అంటే ఓ కుటుంబానికి చెందిన వ్యక్తి కాదు. ఆయన తెలుగు సినిమాకు ఓ ఎమోషన్‌. ధైర్యానికి కేరాఫ్‌ అడ్రెస్‌. సూపర్ స్టార్ అంత్యక్రియలు మహాప్రస్థానం లో జరిగిన విషయం తెలిసిందే. ఇక ఇదిలా ఉంటే సూపర్ స్టార్ పెద్ద కుమారుడు ర‌మేష్ బాబు గురించి అందరికీ తెలుసు. కానీ అంత పాపులర్ కాదు. రమేష్ బాబు కి ఉన్న అనారోగ్య సమస్యలే ఆయన మరణించారు. కృష్ణ పెద్ద కుమారుడు ర‌మేష్ బాబు మరణాన్ని కృష్ణ గారు తట్టుకోవడం చాలా కష్టం.

రమేష్ బాబు, మహేష్ బాబు ఇద్దరు “పోరాటం” సినిమా లో కలిసి నటించారు. ఆ సినిమాలో ఇద్దరు చక్కగా నటన కనబరిచినప్పటికీ.. ఆ సినిమా తరువాత రమేష్ బాబు కు మంచి సినిమాలు పడలేదు. దీనితో సినిమాల్లోకి రాలేదు రమేష్ బాబు. రమేష్ బాబు కి ఒక అమ్మాయి, అబ్బాయి వున్నారు. బహుశా మీరు ఎప్పుడు చూసి వుండరు. సోషల్ మీడియా లో రమేష్ బాబు పిల్లల ఫోటో ఒకటి వైరల్ అవుతోంది. మరి సోషల్ మీడియా లో షికార్లు కొడుతున్న ఆ ఫోటో ని మీరూ ఓ లుక్ వేసేయండి. మహేష్ బాబు ఇరు వైపున రమేష్ బాబు ఇద్దరి పిల్లలు ఈ ఫోటో లో నిలబడి వున్నారు.