రామోజీరావు గారి చివరి కోరిక ఏంటో తెలుసా..? అది తీరకుండానే చనిపోయారా..?

రామోజీరావు గారి చివరి కోరిక ఏంటో తెలుసా..? అది తీరకుండానే చనిపోయారా..?

by Mohana Priya

Ads

వ్యాపార దిగ్గజం రామోజీరావు గారు ఇవాళ చివరి శ్వాస విడిచారు. రామోజీరావు గారు ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ అభివృద్ధి చెందడానికి ఒక ముఖ్య స్తంభంగా నిలిచారు. ఉషాకిరణ్ మూవీస్ ద్వారా ఎంతో మందిని సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేశారు. ఎన్నో సినిమాలని నిర్మించారు. ఎన్నో కొత్త రకమైన సీరియల్స్ ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చారు. రామోజీ రావు గారు ఈనాడు పేపర్ లో ఎక్కువగా తెలుగు పదాలనే వాడమని చెప్పేవారట. “వాటి అర్థాలు ఇప్పటి కాలం వారికి తెలియదు” అని ఎవరైనా అంటే, “ఇప్పుడు తెలుసుకుంటారులే. మీరు రాయండి” అని అనేవారట.

Video Advertisement

ఎన్నో సంవత్సరాల నుండి ఈటీవీలో కొన్ని ప్రోగ్రామ్స్ వస్తూనే ఉన్నాయి. అందులో అన్నదాత, ఆ తర్వాత ప్రసారం అయ్యే ఈటీవీ న్యూస్ ఒకటి. వాటి టైమింగ్స్ ఇన్ని సంవత్సరాలు అయినా కూడా మారలేదు. అలాగే రాత్రిపూట వచ్చే ఈటీవీ న్యూస్ కూడా తొమ్మిదింటికి ప్రసారం అవుతాయి. ఒక మనిషి తలుచుకుంటే ఏదైనా సాధించగలరు అనే దానికి రామోజీరావు గారు ఒక నిదర్శనంగా నిలిచారు. రామోజీరావు గారి మృతి పట్ల ఎంతో మంది ప్రముఖులు సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు. రామోజీరావు గారికి సంతాపం తెలుపుతూ, రేపు ఎటువంటి షూటింగ్స్ జరగకూడదు అని ఫిలిం ఛాంబర్ ఆదివారం షూటింగ్స్ కి సెలవు ప్రకటించారు.

ఎంతో మంది ప్రముఖులు రామోజీరావు గారికి నివాళులు అర్పిస్తూ, ఆయన చేసిన గొప్ప పనులను గుర్తు చేసుకుంటున్నారు. అయితే, రామోజీరావు గారి చివరి కోరిక ఒకటి ఉంది. అది తీరకుండానే రామోజీ రావు గారు మరణించారు. ఉషా కిరణ్ మూవీస్ సంస్థ ద్వారా 100 సినిమాలు నిర్మించాలి అని రామోజీరావు గారి కల అట. అది తీరకుండానే రామోజీ రావు గారు ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. ఉషా కిరణ్ మూవీస్ 60 కి పైగా సినిమాలని నిర్మించారు. వంద సినిమాలు నిర్మించాలని రామోజీరావు గారు అనుకున్నారు. ఆగస్టులో ఈనాడు కి 50 సంవత్సరాలు పూర్తవుతాయి. దానికి కొంత కాలం ముందే రామోజీరావు గారు ఇలా వెళ్లిపోవడం బాధాకరం అని అంటున్నారు. రామోజీరావు గారికి భారతరత్న ఇచ్చి ఆయన చేసిన సేవలను గుర్తించాలి అని పలువురు ప్రతిపాదిస్తున్నారు.


End of Article

You may also like