ఎన్నో సంవత్సరాలు ఎన్నో సినిమాల్లో హీరోయిన్ గా అలరించి తర్వాత కొంచెం ఇష్టం కొంచెం కష్టం సినిమా లో సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టారు రమ్యకృష్ణ. పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ బాహుబలి సినిమాలో  శివగామి గా తెలుగు సినిమా హిస్టరీలోనే నిలిచిపోయే పాత్ర చేశారు. ఆ తర్వాత సోగ్గాడే చిన్ని నాయన, హలో, బాలకృష్ణుడు, మామ మంచు అల్లుడు కంచు, శైలజ రెడ్డి అల్లుడు ఇలా ఎన్నో సినిమాల్లో నటించారు.

ramya krishna and krishna vamsi birthday wishes to their son

అంతే కాకుండా జయలలిత గారి జీవితం ఆధారంగా రూపొందిన క్వీన్ వెబ్ సిరీస్ లో కూడా మెయిన్ లీడ్ గా నటించారు రమ్యకృష్ణ. రమ్యకృష్ణ డైరెక్టర్ కృష్ణ వంశీని ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. కృష్ణ వంశీ టేకింగ్ కి ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారు.

ramya krishna and krishna vamsi birthday wishes to their son

అటు సింధూరం, ఖడ్గం లాంటి దేశ భక్తి  సినిమాలతో పాటు, ఇటు మురారి, నిన్నే పెళ్ళాడుతా, గోవిందుడు అందరివాడేలే, చందమామ లాంటి ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమాలను, అంతే కాకుండా అంతపురం, డేంజర్, గులాబీ, సముద్రం లాంటి థ్రిల్లర్ సినిమాలను కూడా కూడా ఎంతో బాగా హ్యాండిల్ చేస్తారు కృష్ణ వంశీ.

ramya krishna and krishna vamsi birthday wishes to their son

ప్రస్తుతం కృష్ణ వంశీ మరాఠీ సూపర్ హిట్ సినిమా నట్ సామ్రాట్ రీమేక్ గా రూపొందుతున్న రంగమార్తాండ చిత్రం షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, రమ్య కృష్ణ, బ్రహ్మానందం గారు, అనసూయ భరద్వాజ్, శివాత్మిక రాజశేఖర్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

ramya krishna and krishna vamsi birthday wishes to their son

రమ్యకృష్ణ, కృష్ణ వంశీ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉన్నా కూడా తమ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలను ఎక్కడా బయట పెట్టరు. అయితే ఇటీవల వీరి కొడుకు రిత్విక్ వంశీ పుట్టినరోజు కావడంతో రిత్విక్ కి పుట్టినరోజు విషెస్ చెప్తూ రమ్యకృష్ణ తన సోషల్ మీడియా అకౌంట్ లో పిక్చర్ పోస్ట్ చేశారు.

ramya krishna and krishna vamsi birthday wishes to their son

కృష్ణ వంశీ కూడా తను, రమ్యకృష్ణ, రిత్విక్ తో ఉన్న ఫోటో పోస్ట్ చేసి “గాడ్ బ్లెస్స్ యు నాన్న బంగారం హ్యాపీ బర్త్డే” అని విష్ చేశారు. రమ్యకృష్ణ కూడా వారి ముగ్గురి ఫోటో పోస్ట్ చేసి రిత్విక్ కి పుట్టినరోజు విషెస్ తెలిపారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియా లో వైరల్ అవుతోంది.

ramya krishna and krishna vamsi birthday wishes to their son