“సందీప్ రెడ్డి వంగా” కూడా కాపీ కొట్టారా..? ఎక్కడి నుండి అంటే..?

“సందీప్ రెడ్డి వంగా” కూడా కాపీ కొట్టారా..? ఎక్కడి నుండి అంటే..?

by kavitha

Ads

అర్జున్ రెడ్డి సినిమా ఎలాంటి విజయం సాధించిందో అందరికి తెలిసిందే. విజయ్ దేవరకొండ ఓవర్ నైట్ స్టార్ హీరోగా మారారు. ఇక ఈ మూవీతో సంచలనం సృష్టించిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగాకి గుర్తింపు వచ్చింది. అదే సినిమాని బాలీవుడ్ లో ‘కబీర్ సింగ్’ గా రీమేక్ చేశాడు. ఆ మూవీ అక్కడ కూడా బ్లాక్ బస్టర్ అవడంతో దేశవ్యాప్తంగా సందీప్ రెడ్డి పేరు మారుమ్రోగిపోయింది.

Video Advertisement

‘కబీర్ సింగ్’ తరువాత సందీప్ రెడ్డి వంగా ప్రస్తుతం బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ హీరోగా ‘యానిమల్’ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. తాజాగా ఈ మూవీ నుండి మేకర్స్ ప్రీ టీజర్ రిలీజ్ చేశారు. అయితే సందీప్ రెడ్డి వంగా ఈ మూవీని ఆ సినిమాల నుండి కాపీ చేశాడనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఆ చిత్రాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..
రణబీర్ కపూర్,సందీప్ రెడ్డి వంగా వంటి క్రేజీ కాంబోలో తెరకెక్కుతున్న ‘యానిమల్’ పై మొదటి నుంచే భారీ అంచనాలు ఏర్పడ్డాయి.ఈ చిత్రంలో రష్మిక మందాన హీరోయిన్ గా నటిస్తుంది. సీనియర్ హీరో అనిల్ కపూర్, బాబీ డియోల్ ముఖ్యమైన పాత్రలలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని భూషణ్ కుమార్ టి సీరీస్ బ్యానర్ లో నిర్మిస్తున్నారు. యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఆగస్టు 11న 5 భాషలలో గ్రాండ్ గా విడుదల కానుంది. దీంతో మూవీ యూనిట్ ప్రమోషన్స్ ప్రారంభించింది.
ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా యానిమల్ ప్రీ టీజర్ రిలీజ్ చేశారు. ఈ టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. దాంతో పాటు మూవీ పై మరిన్ని అంచనాలు పెరిగాయి. టీజర్ లో స్కల్ మాస్క్ పెట్టుకొన్న ఒక గ్యాంగ్ హీరో రణబీర్ కపూర్ పై అటాక్ చేయడం, రణబీర్ వారిపై అటాక్ చేయడంతో ఆ గ్యాంగ్ భయంతో పరుగులు తీస్తారు. ఈ టీజర్ రక్తపాతాన్ని తలపించింది. అయితే ఇందులో చూపించిన యాక్షన్ సీన్స్ 2003లో రిలీజ్ అయిన కొరియన్ మూవీ ‘ఓల్డ్ బాయ్’నుంచి డైరెక్టర్ సందీప్ రెడ్డి కాపీ చేశాడని కామెంట్స్ వినిపిస్తున్నాయి. అది మాత్రమే కాకుండా ఈ మూవీ కూడా స్క్వాడ్ గేమ్స్, ది మ్యాన్ ఫ్రమ్ నోవేర్, ఓల్డ్ బాయ్ లాంటి కొరియన్ సినిమలను మిక్స్ చేసి, తీశారని ఆరోపణలు వస్తున్నాయి. ఈ టీజర్ రిలీజ్ తరువాత సందీప్ రెడ్డి వంగాను సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు.

Also Read: మళ్లీ ఆగిన గుంటూరు కారం షూటింగ్..! కారణం ఏంటంటే..?


End of Article

You may also like