Ads
నాగ శౌర్య అంటే పడి చచ్చే అమ్మాయిలు చాలా మంది ఉన్నారు. ఇక జూలై 7 న విడుదలైన రంగబలి సినిమాతో ఒక హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ సినిమా ఒకరకంగా పెద్ద ప్రమోషన్స్ లేకుండా సైలెంట్ హిట్ కొట్టిందనే చెప్పాలి. ఈ సినిమా అందరికీ బాగా నచ్చడానికి నాగ శౌర్య, సత్య కామెడీనే కీలకం అని చెప్పొచ్చు. కానీ ఈ సినిమా కథ వెనక అసలు అర్థం ఎంటో తెలుసా.
Video Advertisement
అయితే నాగశౌర్య ఇటీవల వైరల్ అయిన వీడియోతో అందరినీ ప్రేమని సొంత చేసుకున్నాడు. అదే ఒక అమ్మాయిని రోడ్డుపై ప్రేమ పేరుతో తన ప్రియురాలిని కొడుతున్న టైంలో నాగ శౌర్య వెళ్లి ఆపి మందలించాడు. అమ్మాయిని కొట్టడం తప్పు అంటూ సీరియస్ అయ్యారు.
దీంతో నాగ శౌర్యకి అమ్మాయిలపై ఉన్న గౌరవం చూసి చాలా మంది హ్యాట్స్ ఆఫ్ చెబుతున్నారు. ఇలాంటి అబ్బాయే జీవిత భాగస్వామి అయితే అంతకన్నా ఏమి కావాలని అంటున్నారు. ఇదిలా ఉంటే రంగబలి సినిమా అసలు నేపథ్యం ఏంటంటే, శౌర్యకు సొంత ఊరు అంటే పిచ్చి. అదే అతని బలం, బలహీనత. ఫేమస్ అవ్వడానికి ఎటువంటి షోలు అయినా చేస్తుంటాడు, తనని ఎవరూ ఆపేది అనే ఆలోచనతో ఉంటాడు. అలా స్నేహితులు కూడా శౌర్యను షో అనే పిలుస్తారు.
సింపుల్ గా చెప్పాలంటే రాజవరం అంటే శౌర్య, శౌర్య అంటే రాజవరం అనే ఫీలింగ్ లో బ్రతుకుతుంటాడు. ఇక శౌర్యను మర్చాలని మెడికల్ షాపు నడుపుకునే సామాన్య వ్యక్తి అయిన తన తండ్రి విశ్వం ( గోప రాజు) గొడవలు పెట్టుకుంటూ ఆకతాయిగా తిరిగే కొడుకుని బాగు చెయ్యాలని సిటీ పంపిస్తే… అక్కడ నాన్న కోరిక మేరకు ఫార్మసీ కోర్సు కోసం హైదబాద్ లోని కాలేజీలో జాయిన్ అవుతాడు.
కామన్ గానే హీరోయిన్ తో ప్రేమలో పడతాడు… హీరోయిన్ తండ్రి తండ్రి ( మురళీ శర్మ) ఒప్పుకున్నప్పటికీ… హీరోడి రాజవరం అని తెలిసి వద్దంటాడు. అక్కడే సినిమాలో ట్విస్ట్ మొదలవుతుంది. అందుకే సినిమా మంచి హిట్ అందుకుంది. ఇక ఈ సినిమా పవన్ బాసం శెట్టి దర్శకత్వంలో, ఎస్ఎల్ఎన్ సినిమాస్ పతాకంపై సుధాకర్ చేరుకూరి నిర్మించారు. అంతే కాకుండా నెట్ ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్ ఫాంలో ఆగస్ట్ 4న విడుదల కానుంది.
ALSO READ : బేబీలో అసలు ఆ పాట ఎందుకు లేదు?? మళ్లీ ఇప్పుడు ఈ ట్విస్ట్ ఏంటి??
End of Article