సినిమాలోని పాత్రలకు తగ్గట్టు నటీనటులను ఎంచుకునే విషయంలో చాలామంది దర్శకులు తర్జన భర్జన పడుతుంటారు.అందుకే అప్పుడప్పుడు కథ బాగుంది కాని ఆ కథకి ఆర్టిస్ట్ లే మైనస్ అయ్యారు అంటూ రివ్యూస్ మరియు విమర్శలు వస్తుంటాయి.దీనికి కారణం తెరపై ఇప్పటివరకు కలిసి నటించిన జంటలను కొత్తదనం కోసం కలిపి దర్శకులు చేతులు కాల్చుకోవాలి అనుకోవడమేనని విశ్లేషకులు అభిప్రాయపడుతుంటారు.అలా తెర మీద ఎవరి ఊహకు అందని విధంగా కొన్ని జంటలు కలిసి నటించాయి. అలా వారు కలిసి నటించారనే విషయం చాలామంది సినీ ప్రేక్షకులకు తెలియదు.ఇంతకి ఆ నటీనటులు ఎవరో వారు నటించిన చిత్రాలు ఏవో ఇప్పుడు చూద్దాం.

సుమంత్ & కాజల్ అగర్వాల్ :

సినిమా హిట్,ఫ్లాప్ గురించి పట్టించుకోకుండా ఎప్పుడు ప్రయోగాత్మక చిత్రాలు చేస్తూ వెళ్లే సుమంత్ కెరియర్ లో హిట్ ల కంటే ఫ్లాప్ లే ఎక్కువున్నాయి.మళ్లీ రావా చిత్రంతో తన సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన సుమంత్ తన నెక్స్ట్ మూవీ కపటదారి చిత్రంతో బిజీగా ఉన్నాడు.ఈయన 2008లో కాజల్ అగర్వాల్ తో కలిసి పౌరుడు అనే చిత్రం చేశాడు.ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా పడింది.

శ్రీకాంత్ & అంజలా జవేరీ :

కెరీర్ ఎండింగ్ లో అంజలా జవేరీ ఫ్యామిలీ హీరో శ్రీకాంత్ తో కలిసి ప్రేమ సందడి చిత్రంలో చేసింది.ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టకోలేకపోయింది.

సుమంత్ & అనుష్క శెట్టి :

పూరి జగన్నాధ్ దర్శకత్వంలో వచ్చిన సూపర్ సినిమాలో మెరిసిన అనుష్క ఆ తర్వాత సుమంత్ తో కలిసి మహానంది చిత్రంలో నటించింది.ఈ చిత్రం ఒకటి ఉందని చాలామందికి తెలియదు.

సుమన్ & సిమ్రాన్ :

ఇప్పటికీ ఎంతోమంది కుర్రాళ్ళకు కలల రాకుమారి అయినా సిమ్రాన్ తన తొలి తెలుగు చిత్రం సుమన్ తో చేసింది.ప్రస్తుతం ఈయన చిత్రాలలో హీరో హీరోయిన్లకు తండ్రిగా నటిస్తున్నాడు.

బాలకృష్ణ & లయ :

2004లో బాలకృష్ణ నటించిన విజయేంద్ర వర్మలో ఈమె బాలకృష్ణ పక్కన జంటగా నటించారు.బాలకృష్ణ కుందేలు ను కాపాడడానికి కొండ ఎక్కే సీన్ ఈ చిత్రంలోదే.నటీనటులు నటన ప్రేక్షకులను ఆకట్టుకున్న,కథ బలం లేకపోవడంతో చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద విఫలమైంది.

మహేష్ బాబు & సిమ్రాన్ :

అమ్మాయిల కలల రాకుమారుడు సూపర్ స్టార్ మహేష్ బాబు యువరాజు చిత్రంలో సిమ్రాన్ తో కలిసి నటించారు.ఈ చిత్రంలో హీరోయిన్ సాక్షి శివానంద్ ఒకటే అని అందరూ అనుకుంటారు.కాని ఈచిత్రంలో సిమ్రాన్ కూడా ఉంది.

 


తెలుగు కంటెంట్ రైటర్స్ కి తెలుగుఅడ్డా ఆహ్వానం.! Mail us your resume and samples to: teluguaddahr@gmail.com