ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన “నరసింహ నాయుడు” మూవీ రిలీజ్ టైం లో ఏం జరిగిందో తెలుసా..??

ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన “నరసింహ నాయుడు” మూవీ రిలీజ్ టైం లో ఏం జరిగిందో తెలుసా..??

by Anudeep

Ads

సీనియర్ ఎన్టీఆర్ వారసుడిగా ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టిన నందమూరి బాలకృష్ణ అప్పట్లో ఎన్నో బాక్సాఫీస్ హిట్స్ అందుకున్నాడు. ఆయన చేసిన సినిమాలు ఒక ట్రెండ్ సెట్ చేశాయనే చెప్పాలి. ఇక బి.గోపాల్ దర్శకత్వంలో తెరకెక్కిన నరసింహా నాయుడు సినిమా ఒక చరిత్ర సృష్టించింది.

Video Advertisement

 

 

2001లో ఆ సినిమా సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సరిగ్గా 22 యేళ్ల క్రితం 2001 జనవరి 11న విడుదలై సంచలన విజయం సాధించింది. అంతేకాదు టాలీవుడ్ ఇండస్ట్రీ హిట్‌‌ను నమోదు చేసింది. ఈ చిత్రంలో బాలకృష్ణ సరసన సిమ్రాన్, ప్రీతి జింగానియా, ఆషా సైనీ కథానాయికలుగా నటించారు. మణిశర్మ సంగీతం అందించిన ఈ సినిమా మ్యూజికల్‌గా సూపర్ హిట్‌ అయ్యింది.

rare situation at narasimhanayudu release time..

నరసింహనాయుడు చిత్రం తెలుగులో తొలిసారి వందకు పైగా 105 కేంద్రాల్లో 100 రోజులు పూర్తి చేసుకుంది. అంతే కాకుండా ఏలూరు లోని అంబికా కాంప్లెక్స్ లోని రెండు థియేటర్లలో కేవలం వారం రోజుల్లోనే 101 షో లు ప్రదర్శితమై రికార్డు సృష్టించింది. కలెక్టర్ నుంచి అనుమతి తీసుకొని రోజుకి ఏడు, ఎనిమిది షో లు ప్రదర్శించారు. అలాగే ఆ సమయం లో పలు విచిత్ర పరిస్థితులు కూడా వచ్చాయి.

rare situation at narasimhanayudu release time..

ఈ చిత్రం సూపర్ హిట్ కావడం తో టికెట్స్ కోసం క్యూలో జనాలు నిలబడితే ఎక్కడ తొక్కిసలాట జరుగుతుందో అని భయపడి టికెట్స్ థియేటర్ లోపల సీట్స్ లో కూర్చున్న వారికి ఇచ్చారట థియేటర్ల యాజమాన్యం. అంతటి పెను ప్రభంజనం సృష్టించింది నరసింహనాయుడు చిత్రం. బి. గోపాల్, బాలయ్య కాంబినేషన్ లో వచ్చి హ్యాట్రిక్ హిట్ గా నిలిచింది.

rare situation at narasimhanayudu release time..

ఇక జూన్ 10వ తారీఖున బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా 20 సంవత్సరాల క్రితం వచ్చిన నరసింహనాయుడు చిత్రాన్ని ఫోర్ కేలో మళ్లీ విడుదల చేయాలని రంగం సిద్ధం చేస్తున్నారు. ఈ సినిమా ద్వారా వచ్చే కలెక్షన్స్ ని పూర్తిగా సేవా కార్యక్రమాల కోసమే ఉపయోగించాలని నిర్ణయించుకున్నారట. ఇక ఇప్పుడు ఈ చిత్రం రీ రిలీజ్ లో ఎన్ని రికార్డ్స్ నెలకొల్పుతుందో చూడాలి.

Also read: సీనియర్ ఎన్టీఆర్ గారి చేతిరాత ఎప్పుడైనా చూశారా ? ముత్యాల్లాంటి రాత…అచ్చం ప్రింట్ లాగే.!


End of Article

You may also like