2014 లో రాశీ ఖన్నా ఊహలు గుసగుసలాడే సినిమాతో మనకి పరిచయం అయింది అంతకి ముందే ఆమె 2013 లో మద్రాసు కెఫే అనే ఒక హిందీ సినిమాలో నటించింది. తర్వాత ఈమె జోరు, బెంగాల్ టైగర్, శివం, జై లవకుశ, రాజా ది గ్రేట్, విలన్, ఆక్సిజన్ టచ్ చేసి చూడు, వెంకీ మామ ఇలా చాలా సినిమాల్లో నటించింది.

Video Advertisement

కేవలం తెలుగు సినిమాలు మాత్రమే కాకుండా ఈమె హిందీ, తమిళ్, మళయాల చిత్రాల్లో నటించింది. మనం సినిమా లో కూడా ఈమె ఒక గెస్ట్ రోల్ చేసింది.

అయితే రాశీ ఖన్నా ఊహలు గుసగుసలాడే సినిమాకి హీరోయిన్ అవ్వడం వెనక ఒక పెద్ద కథ అవుతుంది. అంతేకాక ఆమె ఒక ముఖ్యమైన పాత్రని మిస్ చేసుకుంది. ఇక వాటికోసం తెలుసుకుందాం. మద్రాసు కెఫే సినిమా తర్వాత రాజమౌళి బాహుబలి సినిమా కోసం ఆడిషన్స్ చేస్తున్నారట. అవంతిక పాత్ర కోసం ఈ ఆడిషన్ చేయడం జరిగింది. రాశీ ఖన్నా ని రాజమౌళి ఏ పిలిచారట. రాజమౌళి మద్రాసు కెఫే సినిమా చూసి ఈమె ని ఆడిషన్స్ కి పిలవడం జరిగింది.

రాజమౌళితో సినిమా చేయడం ప్రతి ఒక్కరి కల చాలామంది హీరోలు హీరోయిన్లు రాజమౌళి సినిమాలో చిన్న చాన్స్ వచ్చిన సరే చేయాలని చూస్తారు. రాశీ ఖన్నా కూడా ఏదైనా చిన్న పాత్ర రాజమౌళి సినిమాలో ఉంటే చేయాలని చూస్తోంది. అయితే ఈ ఆడిషన్స్ కి ఈమె వెళ్ళినప్పుడు రాజమౌళి చాలా క్యూట్ గా ఉంది ఈ అమ్మాయి ఏదైనా లవ్ స్టోరీ కి బాగా సెట్ అవుతుందని అన్నారు. ఆ తర్వాత తన ఫ్రెండ్ ఒక అతను లవ్ స్టోరీ కోసం పని చేస్తున్నారని… ఆ స్టోరీ విను తప్పకుండా నీకు నచ్చుతుంది అని రాజమౌళి ఈమె కి చెప్పారట. అలా ఆమె ఊహలు గుసగుసలాడే సినిమా లో నటించి తెలుగు ఆడియన్స్ కి పరిచయమైంది.