వాళ్ళు ఫ్రీ రేషన్ అడగడం ఆశ్చర్యంగా ఉంది…దానికోసమైతే డబ్బులున్నప్పుడు?

వాళ్ళు ఫ్రీ రేషన్ అడగడం ఆశ్చర్యంగా ఉంది…దానికోసమైతే డబ్బులున్నప్పుడు?

by Anudeep

Ads

లాక్ డౌన్ 3 .0 లో కొన్ని సడలింపులు ఇస్తూ వాణిజ్యపరమైన వాటిలో కొన్నింటికి అనుమతులు ఇచ్చిన సంగతి తెలిసిందే..దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిన లిక్కర్ టాపిక్. గ్రీన్ జోన్లలో మద్యం అమ్మకాలకు కేంద్రం అనుమతులు ఇవ్వడంతో అమ్మకాలు భారీగా ఊపందుకున్నాయి. వైన్ షాపుల ముందు మందు బాబులు భారీగా బారులు తీరారు…ఇన్ని రోజులు ముందుకు కోసం ఎదురుచూసిన గొంతులు పండగ చేసుకున్నాయి.,అయితే కొందరు మాత్రం ఈ నిర్ణయాన్ని ఖండిస్తున్నారు.

Video Advertisement

 

తీవ్రమైన అసహనం వ్యక్తం చేశారు.ఇన్ని రోజులు కష్ట పడి చేసిన లాక్ డౌన్ యొక్క ఫలితం మొత్తం బూడిదలో పోసిన పన్నీరే ..అని వాపోతున్నారు.ఇలా చేస్తే కరోనా మరింతలా వ్యాప్తి చెందే అవకాశం ఉందంటూ అభిప్రాయపడుతున్నారు.ఇదే అంశం మీద యాంకర్ రష్మీ గౌతమ్ స్పందించారు తనదైన శైలిలో స్పందించారు.ఉచిత రేషన్ కోసం అభ్యర్థించే ఈ నిరుపేదవారు ఇప్పుడు ఏకంగా ఆల్కహాల్ కోసం డబ్బులని సర్దుబాటు చేసుకొని కొనడం చూస్తుంటే ఆశ్చర్యం వేస్తుందంటూ రష్మీ …విమర్శించారు ” ‘‘మే 4 తరవాత లిక్కర్ షాప్‌లకు వస్తోన్న ప్రతి ఒక్కరికీ ఎన్నికల్లో మాదిరిగా చెరిగిపోని ఇంక్‌తో మార్కింగ్ వేయాలి.

Also Read : తప్పుగా ప్రవర్తించారు అంటే…ఆ సీనియర్ ఆక్టర్ నా గురించి దుష్ప్రచారం చేసారంట?

 

 

ఇలాంటి వ్యక్తులు ఉచిత ఆహారానికి కానీ, ప్రభుత్వం లేదంటే ఇతరుల ద్వారా అందుతోన్న ఉచిత సరుకులకు కానీ అర్హులు కాదు. వారి రేషన్‌ను కూడా ఆపేయాలి. మద్యం కొనుగోలు చేయడానికి అతని వద్ద డబ్బు ఉన్నప్పుడు, ఉచితాలు ఎందుకు ఇవ్వాలి?’’అంటూ రష్మీ తనదైన శైలిలో స్పందించారు ఇప్పుడు ఈ విషయంలో ప్రభుత్వాన్ని విమర్శించడం ఒకటే పరిష్కారం కాదని అన్నారు.దేశంలోని అన్ని వ్యాపారాలను తిరిగి ప్రారంభించాలని దీర్ఘకాలిక లాక్ డౌన్ వల్ల ఒక దేశం మనుగడ సాగించడం కష్టమని తెలిపారు.కరోనా మహ్మమురికి వ్యాక్సిన్ వచ్చేంత వరకు మనము పరిస్థితిని అర్థం చేసుకొని దానికి తగినట్టుగా నడుచుకోవాలని అన్నారు.

 

 

వైరస్ ని మరింత వ్యాప్తి చెందకుండా చూడాలన్నారు జోన్ల ని విభజించిన తరువాత లిక్కర్ అమ్మకాలు ఒక్కటే సమస్య కాదని రష్మీ తన అభిప్రాయం చెప్పారు.ఇళ్లలో సాయం ,పని మనుషులు తిరిగి రావాలని కూడా ప్రజలు ఎదురు చూస్తున్నారని అన్నారు అయితే వృద్ధులు మినహాయించి మిగితా వారు సక్రమంగా తమ తమ ఇళ్లల్లో ఇంకొన్ని రోజులు పని చేసుకోలేరా అంటూ ప్రశ్నించారు!


End of Article

You may also like