అద్దె కట్టలేక ఇల్లు మారేవాళ్ళం..! “రష్మిక మందన్న” ఎమోషనల్ కామెంట్స్..!

అద్దె కట్టలేక ఇల్లు మారేవాళ్ళం..! “రష్మిక మందన్న” ఎమోషనల్ కామెంట్స్..!

by Anudeep

Ads

రష్మిక మందన్న.. నేషనల్ క్రష్ గా పేరు సంపాదించినా ఈ ముద్దుగుమ్మ.. పుష్ప చిత్రం తో పాన్ ఇండియా రేంజ్ హీరోయిన్ అయిపోయింది. ఈ నేపథ్యం లో ఈమె వరుసగా భారీ ప్రాజెక్టుల్లో నటిస్తోంది. ప్రస్తుతం రష్మిక చేతిలో రెండు బాలీవుడ్ చిత్రాలు, తెలుగు, తమిళం లో మరో రెండు చిత్రాలు ఉన్నాయి.

Video Advertisement

 

పుష్ప సినిమా తర్వాత రెమ్యూనరేషన్‌ని కూడా భారీగా పెంచేసిన రష్మిక‌తో తమ ప్రొడెక్ట్స్‌ని ప్రచారం చేసుకోవడానికి కంపెనీలూ పోటీపడుతున్నాయి. దాంతో యాడ్స్ ద్వారా కూడా ఈ అమ్మడు భారీగా ఆర్జిస్తోంది. ప్పుడు రూ.కోట్లలో ఆర్జిస్తున్న రష్మికకి బాల్యంలో ఆర్థికంగా చాలా చేదు అనుభవాలు ఎదురయ్యాయట. ఇల్లు అద్దె కట్టలేని పరిస్థితుల్లో తమ కుటుంబం ఉండేదని ఆమె చెప్పుకొచ్చింది.

rashmika about her childhood..

ఇటీవల ఒక ఇంటర్వ్యూ లో రష్మిక తన బాల్యానికి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది. ” మా పేరెంట్స్ ఆర్థిక ఇబ్బందులు పడుతూ ఉండేవారు. నెలాఖరున ఇంటి అద్దె కట్టేందుకు కుదిరేది కాదు . దీంతో ఇంటి యజమానులు ఖాళీ చేయిస్తూ ఉండేవారు. ప్రతి రెండు నెలలకు కొత్త ఇల్లు వెతుక్కోవడం నిత్యకృత్యం అయ్యేది. నిలువ నీడ కోసం వీధుల్లో తిరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. పేరెంట్స్ నేను ఏది అడిగినా కాదనేవారు కాదు. అయినప్పటికీ నేను ఏమీ అడిగేదాన్ని కాదు. ఎందుకంటే కనీసం ఒక బొమ్మ అడిగినా అది కొనడానికి వాళ్ళ దగ్గర డబ్బులు ఉండేవి కావు.” అని రష్మిక చెప్పుకొచ్చింది.

rashmika about her childhood..

కనీసం సొంత ఇల్లు లేని రష్మిక హీరోయిన్ అయ్యాక కోట్లు సంపాదిస్తున్నారు. ప్రస్తుతం రష్మిక రెమ్యునరేషన్ రూ. 3 కోట్లకు పైమాటే. ముంబైలో రష్మిక విలాసవంతమైన ఇంటిని కొనుగోలు చేసినట్లు సమాచారం. ఎవరి మద్దతు లేకుండా స్వయం కృషితో ఎదిగారు రష్మిక.


End of Article

You may also like