బిజీగా ఉన్న హీరోయిన్లలో ఒకరు రష్మిక మందన్న. ఈ ముద్దుగుమ్మ కేవలం తెలుగులో మాత్రమే కాదు హిందీ, తమిళ్ భాషల్లో కూడా నటిస్తుంది. పుష్ప సినిమాతో రష్మిక ఓ మెట్టు పైకి ఎక్కేసింది. ఇప్పుడు పుష్ప-2 సినిమాతో రష్మిక మందన బిజీగా ఉంది. రష్మిక ఎక్కువగా ట్రోలింగ్ కి గురవుతూ ఉంటుంది. ఇంచుమించుగా చాలామంది హీరోయిన్లు ఇండస్ట్రీలో ట్రోలింగ్ కి గురవుతారు కానీ మొదటి స్థానంలో రష్మిక మందన ఎప్పుడు నిలుస్తూ ఉంటుంది.

Video Advertisement

తాను చేసిన కామెంట్లు చూసి నెటిజన్లు విపరీతంగా ట్రోల్ చేస్తూ ఉంటారు రష్మిక ఏం చెప్పినా తప్పే అన్నట్లుగా ఉంటాయి. అలా ఆమె ప్రతిరోజు సమరం చేస్తోందట.

rashmika comments about banning her from kannada industry..

నిజానికి జీవితంలో ఎప్పుడూ పోరాటం చేయాలి, నటిగా మారడానికి ముందు ఒక యుద్ధం చేయాలి నటిగా మారిన తర్వాత ఇంకో యుద్ధం చేయాలని రష్మిక అంది. హీరోయిన్స్ లైఫ్ గురించి కూడా రష్మిక మందన పలు విషయాలను చెప్పుకొచ్చింది. హీరోయిన్ అయ్యాక ఎక్కువ పోరాటం చేస్తున్నారా..? హీరోయిన్ అవ్వకముందు ఎక్కువ పోరాడారా అని అడిగితే… ముందు సినిమాల్లోకి రావాలంటే ఇంట్లో వాళ్ళతో పోరాటం చేయాలని రష్మిక మందన చెప్పింది. సినిమా రంగంలో నేను రాణించగలనని.. ఆసక్తి నాకు ఉందని ఇంట్లో వాళ్ళని నమ్మించాలి అని రష్మిక చెప్పింది అలా అప్పటినుండి పోరాటం మొదలవుతుంది.

rashmika latest post on negativity..

ఆ తర్వాత నటిగా నిరూపించుకోవడానికి ఇంకో పోరాటం చేయాలి. వరుస అవకాశాలు వస్తున్నప్పుడు పోటీ పడాలి వరుసగా అవకాశాలు వస్తున్నప్పుడు కుటుంబంతో సమయం ఎలా కేటాయించాలి అనేది కూడా చూసుకుంటూ ఉండాలని రష్మిక చెప్పింది. జీవితంలో ఇలా ఎన్నో ప్రశ్నలు.. యుద్ధాలు.. వాటన్నిటితో ముందుకు వెళితేనే జీవితమని రష్మిక చెప్పింది. అలా ముందుకు వెళ్లకపోతే ఎక్కడుండే వాళ్ళు అక్కడే ఉండి పోవాల్సి వస్తుంది అని రష్మిక చెప్పింది. ఇంచుమించుగా అందరి హీరోయిన్ల లైఫ్ లో ఇదే ఉంటుంది చాలామంది మనసులో దాచుకుంటారు కానీ నేను ఎక్స్ప్రెస్ చేస్తున్నాను. వాళ్లు కూడా ఏదైనా సందర్భంలో చెప్తారని రష్మిక చెప్పింది.