ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న టాప్ హీరోయిన్లలో రష్మిక మందన్న ఒకరు. రష్మిక వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. గత సంవత్సరం విడుదలైన పుష్ప సినిమాతో జాతీయస్థాయి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు సీతారామం సినిమాలో కూడా ఒక ముఖ్య పాత్రలో నటించారు.

Video Advertisement

అంతే కాకుండా రష్మిక హిందీలో కూడా రెండు సినిమాల్లో నటిస్తున్నారు. ఇప్పుడు టైగర్ ష్రాఫ్ తో కూడా మరొక సినిమాలో నటిస్తున్నారు. అయితే రష్మికకి సంబంధించిన ఒక న్యూస్ ఒకటి ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఈ విషయంపై రష్మిక ఫ్యాన్స్ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

rashmika mandanna fans angry on a latest news about the actress

“పుష్ప సినిమాలో నటించిన రష్మిక ఇకలేరు” అనే ఒక వార్త ప్రచారంలోకి వచ్చింది. ప్రస్తుతం ఈ వార్త వైరల్ అవుతోంది. దాంతో రష్మిక ఫ్యాన్స్ అందరూ కూడా, “చూసుకోవాలి కదా? అసలు ఇలాంటివి ఎలా రాస్తారు? బతికున్న మనిషి గురించి అలా రాయడానికి బుద్ధి లేదా?” అంటూ ఫైర్ అవుతున్నారు. ఈ వార్త సోషల్ మీడియా అంతటా ట్రెండ్ అవుతోంది. సినిమా వాళ్ల గురించి ఇలాంటి పుకార్లు రావడం ఇది మొదటిసారి ఏమీ కాదు. ఇంతకుముందు చాలామంది బతికున్న నటులు చనిపోయారు అంటూ సోషల్ మీడియాలో చాలా వార్తలు వచ్చాయి.

అందులో తెలుగు, హిందీ సెలబ్రిటీలు చాలామంది ఉన్నారు. వారిలో పెద్దపెద్ద స్టార్ హీరోలు, హీరోయిన్లు కూడా ఉన్నారు. కొంతమంది ఇలాంటి వార్తలని పట్టించుకోకుండా వదిలేశారు. కానీ కొంతమంది మాత్రం వీటికి స్పందించి అలాంటిదేమీ లేదు అని చెప్పారు. అంతేకాకుండా ఎవరో ఒక హీరో ఫోటో పెట్టి ,మరెవరో ఒక యాక్టర్ ఫోటో పెట్టి వారిద్దరికీ మధ్య రిలేషన్ ఉంది, వాళ్ళు బంధువులు అవుతారు అంటూ వార్తలు కూడా చాలానే వచ్చాయి. వీటన్నిటికీ కూడా ఎవరూ పెద్దగా స్పందించలేదు. ఇవన్నీ పరవాలేదు కానీ బతికున్న మనుషులని అలా లేరు అని ప్రచారం చేస్తూ ఉంటే మాత్రం తమ అభిమాన నటీనటులపై అలాంటి వార్తలు రాస్తున్నందుకు ఫ్యాన్స్ మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.