“రష్మిక మందన్న” దగ్గరున్న ఈ లగ్జరీ ఐటమ్స్ గురించి తెలుసా.?

“రష్మిక మందన్న” దగ్గరున్న ఈ లగ్జరీ ఐటమ్స్ గురించి తెలుసా.?

by Anudeep

Ads

ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరోయిన్స్ కి గుర్తింపు రావ‌డానికి కొంత స‌మ‌యం ప‌డుతుంది. అదే కొంద‌రు న‌టీమ‌ణులు మాత్రం ఒక‌టీ రెండు సినిమాల‌తోనే స్టార్ స్టేట‌స్‌ను సొంతం చేసుకుంటారు. అలా ఓవ‌ర్ నైట్ స్టార్ అయిన క‌థానాయిక ర‌ష్మిక మంద‌న్న‌.

Video Advertisement

ఛలో సినిమా ద్వారా టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన రష్మిక ఆ తర్వాత స్టార్ హీరోల సరసన నటించి తక్కువ కాలంలోనే ఎక్కువ క్రేజ్ తన సొంతం చేసుకుంది. ఈ క్రమంలోనే ఇండియన్ క్రష్ గా మారింది. మొదట కన్నడలో ‘కిరిక్ పార్టీ’ సినిమాతో సినీరంగంలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ ప్ర‌స్తుతం సౌత్ టూ నార్త్ వ‌ర‌కు స్టార్ హీరోల‌తో క‌లిసి న‌టిస్తుంది.

మరి తన ఈ ప్రయాణంలో తన దగ్గర ఎంత ఆస్తి సంపాదించింది? తన దగ్గర ఉన్న లగ్జరీ ఐటమ్స్ ఏంటో ఒకసారి చూద్దాం.. ఈ అందాల రాశి మెర్సిడెస్ బెంజ్ సీ క్లాస్ కార్ ని 50 లక్షల రూపాయలతో కొనుగోలు చేసింది. అంతేకాదు ఆడి క్యూ 3 కారు కూడా తన గ్యారేజ్ లో ఉంది. ప్రస్తుతం టయోటా ఇన్నోవా హుండై క్రేటా కార్లు కూడా రష్మిక కలిగి ఉంది.

ఇవేకాక రష్మికకి హ్యాండ్ బ్యాగ్స్ అంటే చాలా ఇష్టం అందుకే అన్ని రకాల బ్రాండ్స్ హ్యాండ్ బ్యాగ్స్ ని మెయింటైన్ చేస్తూ ఉంటుంది. ఏకంగా మూడు లక్షల రూపాయలకు పైగా ఒక్కో హ్యాండ్ బ్యాగ్ పై ఆమె వెచ్చిస్తుంది. అంతేకాదు బెంగళూర్లో 8 కోట్ల రూపాయల విలువచేసే బంగ్లా కూడా రష్మిక పేరున ఉందట. ఇటీవల ముంబై లగ్జరీ ఏరియాలో ఒక ఖరీదైన అపార్ట్మెంట్ ని కూడా కొనుగోలు చేసిందట రష్మిక.

హైదరాబాద్ కి ముంబైకి ప్రస్తుతం ఎక్కువగా ట్రావెలింగ్ చేస్తున్న రష్మిక హైదరాబాదులో కూడా రెండు కోట్ల విలువ చేసే ఒక ఇల్లును కలిగి ఉందట. ఇక ప్రతి సినిమాకి మూడు నుంచి నాలుగు కోట్ల రూపాయల పారితోషకం తీసుకునే ఈ పుష్ప హీరోయిన్ కి చెప్పులు అంటే చాలా ఇష్టమట అందుకే లక్షలు పెట్టి ఎక్కువగా హై హీల్స్, షూస్ ని కొనుగోలు చేస్తూ ఉంటుంది.


End of Article

You may also like