రష్మిక గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. టాలీవుడ్ లో ఎన్నో సినిమాలను చేసింది. అలానే రష్మిక మందన్న శాండిల్వుడ్, బాలీవుడ్ లో కూడా నటిస్తోంది. ఆమె తెలుగు వారినే కాకుండా అక్కడ ప్రేక్షకులని కూడా తన నటన తో ఇంప్రెస్ చేసేస్తోది. పైగా ఆమె కి పాపులారిటీ కూడా ఎక్కువ. పుష్ప మొదటి పార్ట్ తో బాగా మెప్పించిన రష్మిక ఇప్పుడు పుష్ప 2 లో కూడా నటించనుంది.

Video Advertisement

రష్మిక మందన్న తెలుగులో ఛలో సినిమాతో ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ తరవాత ఈమె గీతా గోవిందం, డియర్ కామ్రెడ్ ఇలా ఎన్నో మూవీస్ చేసింది.

rashmika mandanna gets strong reaction from rishab shetty..

హిందీ లో మంచి సినిమాలు చేసింది ఈమె. హిందీ లో మిషన్ మజ్ను అనే స్పై థ్రిల్లర్ లో నటిస్తోంది ఈ భామ. అలానే హిందీ లో ఈమె గుడ్ బై సినిమాలో కూడా చేస్తోంది. మిషన్ మజ్ను విషయానికి వస్తే.. ఇది జనవరి 18 నుంచి స్ట్రీమింగ్ కానుంది. నెట్‌ఫ్లిక్స్‌ లో దీన్ని చూడచ్చు. ఇదిలా ఉంటే ప్రస్తుతం రష్మిక ఓ పాట చేసేందుకు రెడీ అయ్యింది. చాలా మంది హీరోయిన్లు గతం లో ఐటమ్ సాంగ్ ని చేయడం మనం చూసాం.

rashmika mandanna posts an emotional post on negativity

రష్మిక కూడా ఇప్పుడు ఓ పాట ని చెయ్యాలని నిర్ణయం తీసుకుంది. మహేష్, త్రివిక్రమ్ కాంబినేషన్‌ లో వస్తున్న మూవీ లో ఈమె ఐటమ్ సాంగ్ ని చేయడం కోసం సిద్ధం అయ్యినట్టు తెలుస్తోంది. అయితే దానికి ఆమె ఐదు కోట్ల వరకు డిమాండ్ చేసినట్టు తెలుస్తోంది. పైగా ఈ డబ్బులు ఇచ్చేనందుకు నిర్మాతలు కూడా ఒకే అనేసారట. ఇదిలా ఉంటే మహేష్ బాబు నెక్స్ట్ మూవీ ని రాజమౌళి దర్శకత్వంలో చేయనున్నారు. మహేష్ కోసం రాజమౌళి ఏదో పెద్దగానే ప్లాన్ చేస్తున్నారు కూడా.