రష్మిక మందన్న ఇటు టాలీవుడ్ సినిమాలు మాత్రమే కాకుండా శాండిల్వుడ్, బాలీవుడ్ లో కూడా నటిస్తోంది. అక్కడ కూడా ప్రేక్షకులని ఫిదా చేసేస్తోంది ఈ బ్యూటీ. పైగా తిరుగులేని పాపులారిటీని కూడా రష్మిక సంపాదించుకుంది. రష్మిక పుష్ప సినిమాలో శ్రీవల్లి పాత్ర లో బాగా నటించింది. తెలుగు ప్రేక్షకులు బాగా కనెక్ట్ అయ్యేలా వుంది ఆ పాత్ర.

Video Advertisement

ఇప్పుడు పుష్ప 2 లో కూడా ఈమె నటించనుంది. అయితే రష్మిక మందన్న కి సంబంధించి ఓ న్యూస్ ఇప్పుడు అందరిని అవాక్ అయ్యేలా చేస్తోంది.

rashmika mandanna gets strong reaction from rishab shetty..

ఇంతకీ అసలు ఏం జరిగింది అనేది చూస్తే.. కన్నడ చిత్ర పరిశ్రమ రష్మిక మందన్న ని పర్మినెంట్ గా బ్యాన్ చేయడం జరిగింది. దీనితో రష్మిక కన్నడ సినిమాలు ఇక నుండి చేయలేదట. ఎందుకు కన్నడ చిత్ర పరిశ్రమ రష్మిక మందన్న ని పర్మినెంట్ గా బ్యాన్ చేసారంటే..? రష్మిక కన్నడ సినిమాలపై గౌరవం లేకుండా ఎక్కువ సార్లు మాట్లాడింది. అలా ఆమె మాట్లాడడం మూలన కర్ణాటక థియేటర్ ఓనర్లు, డిస్ట్రిబ్యూటర్లు పర్మినెంట్ గా ఆమె ని కన్నడ సినిమాల నుండి బ్యాన్ చేయాలని ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. ఇంకా దీనిపై అధికారికంగా ప్రకటించలేదు.

rashmika about her childhood..

కానీ త్వరలోనే ఈ విషయాన్ని ప్రకటిస్తున్నట్లు తెలుస్తోంది. ”కన్నడ సినిమాల్లో రష్మిక మందన్న ని అధికారికంగా బ్యాన్ చేసారని..ఈమె కన్నడ సినిమాల పైన గౌరవం లేకుండా మాట్లాడడం వలనే బ్యాన్ చేసారని”… ట్విట్టర్ లో రివ్యూలు ఇచ్చే ఉమైర్ సంధు ట్విట్ చేశాడు. అంతే కాకుండా కొంత మంది ట్విట్టర్ యూజర్లు కూడా ఈ విషయం పైన ట్వీట్స్ చేస్తున్నారు. ఈ ఎఫెక్ట్ కొన్ని సినిమాల పైన పడే అవకాశం వుంది. రష్మిక ఇలా చేయడం వలన కన్నడ లో ‘వారిసు’, ‘పుష్ప 2’ సినిమాలను రిలీజ్ చెయ్యమని… అడ్డుకుంటామని అంటున్నారు. హిందీలోని ఓ మీడియా సంస్థకు ఈ భామ ఇంటర్వ్యూ ఇచ్చింది. అందులో ఫస్ట్ ఛాన్స్ ని ఇచ్చిన నిర్మాణ సంస్థ పేరు చెప్పలేదు. రెండు చేతులతో ‘సో కాల్డ్ ప్రొడక్షన్ హౌస్’ అని ఆమె సైగ చేశారట. దీని వలనే కోపం వచ్చింది వాళ్లకి.