కేవలం టాలీవుడ్ సినిమాలు మాత్రమే కాకుండా శాండిల్వుడ్, టాలీవుడ్, బాలీవుడ్ లో కూడా నటించి పాపులర్ అయింది రష్మిక. తాజాగా ఈ బ్యూటీ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా వచ్చిన పుష్ప సినిమాలో నటించి అలరించింది. అలానే పుష్ప 2 లో కూడా ఈమె నటించనుంది.

Video Advertisement

ఇదిలా ఉండగా తాజాగా సోషల్ మీడియా లో ఓ ఫోటో తెగ షికార్లు కొడుతోంది. రష్మిక కి విజయ్ దేవరకొండ కి పెళ్లి అని ఓ ఫోటో సోషల్ మీడియా లో వైరల్ అవుతోంది.

rashmika about her childhood..

ఇంతకీ ఏమైందో ఇప్పుడు చూద్దాం. విజయ్ దేవరకొండ ఇంటికి రష్మిక వెళ్తూ ఉంటుంది. అలానే విజయ్ రష్మిక మాల్దీవులకి కూడా వెళ్లారు. పైగా ‘లైగర్’ సినిమా షూటింగ్ కి కూడా రష్మిక వెళ్ళింది. ముంబై లో కూడా వీళ్ళు ఇద్దరు కలిసి తిరిగారు. అందుకే కొన్ని కధలు కూడా పుడుతున్నాయి. విజయ్ దేవరకొండ, రష్మిక ఇద్దరు పెళ్లి చేసుకున్నట్లు ఓ ఫోటో ఇప్పుడు హల్చల్ అవుతోంది. అయితే సోషల్ మీడియాలో వస్తున్న పిక్ నిజం కాదు. ఇది కేవలం మార్ఫింగ్ చేసిన ఇమేజ్ ఏ. నార్త్ తో వుండే వాళ్ళు దీన్ని తెగ షేర్ చేసేస్తున్నారు. కానీ దీని మీద విజయ్ కానీ రష్మిక కానీ ఏ మాత్రం మాట్లాడలేదు.

ఇదిలా ఉంటే ఎన్నో అంచనాలు పెట్టుకున్నప్పటికీ విజయ్ దేవరకొండ లైగర్ సినిమా హిట్ అవ్వలేదు. భారీ ఎక్స్పెక్టేషన్స్ ప్రేక్షకులు పెట్టుకున్నా డిసప్పాయింట్ చేసింది. మరో పక్క డియర్ కామ్రేడ్ సినిమా కూడా హిట్ అవ్వలేదు. ఇలా విజయ్ దేవరకొండ కి కాలం కలిసి రావడం లేదు.