KGF ఫేమ్ రవీనా టాండన్ ఈ మంచు ఫ్యామిలీ మూవీలో నటించారని తెలుసా..?

KGF ఫేమ్ రవీనా టాండన్ ఈ మంచు ఫ్యామిలీ మూవీలో నటించారని తెలుసా..?

by Anudeep

Ads

ఎన్నో రోజులు వెయిట్ చేసిన తర్వాత కేజీఎఫ్ చాప్టర్-2 విడుదల అయ్యింది. కేజీఎఫ్ మొదటి భాగం ఎవరూ ఊహించనంత పెద్ద హిట్ అయ్యింది. మొదటి భాగం మొత్తంలో కూడా రాకీ భాయ్ ఎలా ఎదిగాడు అనేది చూపించారు. రెండవ భాగంలో మాత్రం రాకీ భాయ్ ఎదిగిన తర్వాత తాను ఎదుర్కొన్న సమస్యలు ఏంటి అనేది చూపించారు? మొదటి భాగంలాగానే ఈ సినిమా కూడా పవర్ ఫుల్ గా ఉంటుంది.

Video Advertisement

అసలు రాకీ భాయ్ ని జనాలు అందరూ అంత గుర్తు పెట్టుకునే అంతగా ఏం చేసాడు అనేది ఈ సినిమాలో చూపించారు. కానీ మొదటి భాగంతో పోలిస్తే ఈ సినిమాలో ఎమోషన్స్ కొంచెం తక్కువగా ఉన్నట్టు అనిపిస్తాయి.

ravina 1

అయితే, ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన రవీనా టాండన్ తెలుగు ప్రేక్షకులకు కొత్తగా అనిపించి ఉండవచ్చు. అయితే.. రవీనా టాండన్ కన్నడ సినిమాల కంటే ముందే తెలుగు సినిమాలో నటించారు అని మీకు తెలుసా..? అది కూడా మంచు ఫ్యామిలీ రూపొందించి, నటించిన మూవీ లో నటించారు అని చాలా మందికి తెలియదు. ఇంతకీ ఈ కెజిఎఫ్ భామ ఏ తెలుగు మూవీలో నటించారో ఇప్పుడు తెలుసుకుందాం.

ravina 2

కెజిఎఫ్ సినిమాతో చాల మంది నటీ నటులకు ఒక్కసారిగా పాన్ ఇండియా లెవెల్ లో గుర్తింపు వచ్చేసింది. అలాగే హీరోయిన్ రవీనా టాండన్ కూడా చాలా పాపులర్ అయ్యారు. అయితే.. అంతకుముందే ఈమె తెలుగులో మంచు ఫ్యామిలీ నటించిన “పాండవులు పాండవులు తుమ్మెద” సినిమాలో నటించారు. ఈ సినిమాలో రవీనా కలెక్షన్ కింగ్ మోహన్ బాబుకు జంటగా కనిపిస్తారు. అయితే ఈ సినిమా తరువాత ఆమెకు తెలుగులో అంతగా అవకాశాలు రాకపోవడంతో ఇతర ప్రయత్నాలు చేసారు. ప్రస్తుతం కెజిఎఫ్ సినిమాతో ఆమెకు అంతులేని స్టార్ డమ్ లభించింది.


End of Article

You may also like