మాస్ మహారాజాగా పేరుగాంచిన స్టార్ హీరో రవితేజ ఎటువంటి సినీ నేపధ్యం లేకుండా ఇండస్ట్రీలో అడుగు పెట్టి, స్టార్ హీరోగా మారారు. గత సంవత్సరం రిలీజ్ అయిన ధమాకా సినిమాతో రవితేజ సూపర్​ హిట్​ సాధించారు. అదే జోష్ లో ఆయన రావణాసుర సినిమాతో కొన్ని రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

Video Advertisement

ఈ క్రమంలో ఈ చిత్ర బృందం ప్రమోషన్ చేయడంలో బిజీగా ఉంది. ఈ సందర్భంగా దర్శకుడు​ హరీశ్​ శంకర్​తో కలిసి రవితేజ ఒక ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. ఇంటర్వ్యూ లో భాగంగా రవితేజ కుమారుడి ఎంట్రీ గురించి అడగడడంతో ఆయన తన కుమారుడి టాలీవుడ్​ ఎంట్రీ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. కాగా ఆయన కుమారుడు మహాధన్ రవితేజ నటించిన ‘రాజా ది గ్రేట్’ చిత్రంలో రవితేజ చిన్నప్పటి రోల్ లో నటించారు. మరి మహాధన్ ఎంట్రీ పై రవితేజ ఇచ్చిన సమాధానం ఏమిటో ఇప్పుడు చూద్దాం..
raviteja-about-his-son-entry1రవితేజ ఈ విషయం పై మాట్లాడుతూ దాని గురించి తెలియదు. ఇప్పటివరకు అలాంటి ఆలోచన కూడా రాలేదు. మహాధన్ ఎంట్రీ  విషయంలో తనకు ఎటువంటి సంబంధం లేదని తెలిపారు. మహాధన్ ఇప్పుడు ఎంజాయ్ చేస్తున్నాడు. అలాగే అతనికి ఆసక్తి కూడా ఉంది. కానీ ఎప్పుడు సినిమాల్లోకి వస్తాడో తెలియదని, ఒకవేళ సినిమాల్లోకి వస్తానంటే మాత్రం వెళ్లమని చెప్తా అని అన్నారు. అయితే సలహా మాత్రం ఇవ్వనని, ఇవ్వాల్సిన సలహాలు ఇప్పటికే ఇచ్చానని, కెరీర్ గురించి మహాధన్ పూర్తి క్లారిటీతో ఉన్నాడుదీనిని బట్టి మహాధన్ త్వరలోనే ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చే ఛాన్స్ లు కనిపిస్తున్నాయి. ఇక మహాధన్ ఎంట్రీ గురించి రవితేజ అభిమానులు ​సంతోషపడుతున్నారు. రవితేజ ఫ్యామిలీ నుండి ఆయన తమ్ముడు రఘు కొడుకు మాధవ్‌ హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఇక రవితేజ హీరోగా సుధీర్ వర్మ తెరకెక్కిస్తున్న సినిమా ‘రావణాసుర’. ఈ సినిమాలో అను ఇమ్మాన్యుయేల్, ఫరియా అబ్దుల్లా, మేఘా ఆకాశ్​ హీరోయిన్లుగా నటిస్తున్నారు. యంగ్ హీరో సుశాంత్ ఈ మూవీలో కీలకమైన పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రం ఏప్రిల్ 7న విడుదల కానుంది.
raviteja-about-his-son-entry-2Also Read: బాలీవుడ్ లో అడుగు పెట్టిన బతుకమ్మ.. సల్మాన్ ఖాన్ చిత్రంలో బతుకమ్మ పాట..