• చిత్రం : రొమాంటిక్
 • నటీనటులు : రవితేజ, శ్రీలీల, జయరామ్, సచిన్ ఖేడేకర్.
 • నిర్మాత : టి జి విశ్వ ప్రసాద్
 • దర్శకత్వం : త్రినాధరావు నక్కిన
 • సంగీతం : భీమ్స్ సిసిరోలియో
 • విడుదల తేదీ : డిసెంబర్ 23, 2022

dhamaka movie review

Video Advertisement

స్టోరీ :

సినిమా ఇద్దరు రవితేజల మధ్య నడుస్తుంది. ఒక రవితేజ లోకల్ గా తిరిగే వ్యక్తి అయితే మరొక రవితేజ సంఘంలో పేరుప్రతిష్టలు ఉన్న ఒక వ్యాపారవేత్త. వారిద్దరికీ సంబంధం ఏంటి? వారిద్దరూ కలిసారా? వారికి ఉన్న సమస్యలు ఏంటి? అవి అన్ని వాళ్ళు ఎలా పరిష్కరించారు? ఇవన్నీ తెలియాలంటే మీరు సినిమా చూడాల్సిందే.

dhamaka movie review

రివ్యూ :

యాక్షన్ కామెడీ సినిమాలతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకున్న స్టార్ హీరో రవితేజ. రవితేజ నటించిన సినిమాలు అన్నీ కూడా భారీ అంచనాల మధ్య విడుదల అవుతాయి. అయితే అందులో కొన్ని హిట్ అయితే కొన్ని మాత్రం ఆశించిన ఫలితాన్ని సాధించలేదు. ఈ సినిమాకి ముందు విడుదల అయిన రామారావు ఆన్ డ్యూటీ సినిమా కూడా పెద్ద హిట్ అవ్వలేదు.

dhamaka movie review

దాంతో ఈ సినిమా మీద ఎక్కువగానే అంచనాలు ఉన్నాయి. సినిమా బృందం కూడా సినిమా మీద చాలా కాన్ఫిడెంట్ గా ఉంది. దాంతో ఈ సినిమా కచ్చితంగా హిట్ అవుతుందని అనుకున్నారు. సినిమా కథ విషయానికి వస్తే పెద్దగా కొత్తదనం ఏమీ లేదు. ఇలాంటి కథ మనం చాలా సినిమాల్లో చూశాం. కానీ టేకింగ్ పరంగా సినిమా ఎలా ఉంది అనేది ముఖ్యం. ఈ సినిమా టేకింగ్ పర్లేదు అనిపిస్తుంది. కొన్ని సీన్స్ మాత్రం ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టే లాగా ఉంటాయి.

dhamaka movie review

ముఖ్యంగా హీరోయిన్ సీన్స్ అయితే ఒక రోటీన్ యాక్షన్ సినిమాలో ఉండే టెంప్లేట్ హీరోయిన్ పాత్ర లాగా అనిపిస్తుంది. సినిమాలో చాలా మంది ప్రముఖ నటీనటులు ఉన్నారు. వారందరూ తమ పాత్రలకి తగ్గట్టు నటించారు. కానీ ఈ సినిమాని తన భుజాల మీద వేసుకొని నడిపించారు రవితేజ. మొదటి నుండి చివరి వరకు చాలా ఎనర్జిటిక్ గా నటించారు. పాటలు చిత్రీకరించిన విధానం కూడా బాగుంది. కొన్ని డైలాగ్స్, పంచ్ లైన్స్ కూడా బాగున్నాయి.

ప్లస్ పాయింట్స్ :

 • రవితేజ
 • నిర్మాణ విలువలు
 • మ్యూజిక్
 • కొన్ని డైలాగ్స్

మైనస్ పాయింట్స్:

 • కథలో లోపించిన కొత్తదనం
 • ప్రేక్షకులకి చిరాకు తెప్పించే సీన్స్

రేటింగ్ :

3/5

ట్యాగ్ లైన్ :

ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా వెళ్తే ఈ సినిమా అందరికీ నచ్చుతుంది. రవితేజ అభిమానులని మాత్రం సినిమా అస్సలు నిరాశ పరచదు. కానీ సినిమా కథలో కొత్తదనం లేదు. దాంతో సాధారణ ప్రేక్షకులకి ధమాకా సినిమా ఒక్కసారి చూడగలిగే యాక్షన్ ఎంటర్టైనర్ గా నిలుస్తుంది.

watch trailer :