టాలీవుడ్ లో మరో ఇంట్రెస్టింగ్ మల్టీస్టారర్ సినిమా రాబోతుందా.. ఈ క్రేజీ కాంబో వర్కౌట్ అయితే మరో సూపర్ హిట్..

టాలీవుడ్ లో మరో ఇంట్రెస్టింగ్ మల్టీస్టారర్ సినిమా రాబోతుందా.. ఈ క్రేజీ కాంబో వర్కౌట్ అయితే మరో సూపర్ హిట్..

by kavitha

Ads

మాస్ మహారాజ రవితేజ ప్రస్తుతం వరుస చిత్రాలతో బిజీగా ఉన్నారు. అంతే కాకుండా వరుస హిట్స్ కొట్టిన జోష్ లో ఉన్నారు. డైరెక్టర్ త్రినాద్ రావు నక్కిన తెరకెక్కించిన ధమాకా మూవీ మంచి విజయాన్ని అందుకుంది. ఈ చిత్రంలో రవితేజ సరసన హీరోయిన్ గా శ్రీలీల నటించింది.

Video Advertisement

ధమాకా తరువాత మెగాస్టార్ చిరంజీవితో కలిసి రవితేజ ‘వాల్తేరు వీరయ్య’ చిత్రంలో నటించారు. ఇక ఈ చిత్రం కూడా సూపర్ హిట్ గా నిలిచింది. ఈ చిత్రం 200 కోట్ల గ్రాస్ క్లబ్ లో స్థానం పొందింది. ఇప్పుడు రవితేజ వరుస చిత్రాలను లైనప్ చేయడమే కాకుండా ఆ చిత్రాల చిత్రీకరణలో బిజీ బిజీగా ఉన్నాడు. ఈ చిత్రాలలో ముందుగా ‘రావణాసుర’ మూవీతో ఆడియెన్స్ ముందుకి రాబోతున్నాడు. సుధీర్ వర్మ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రం త్వరలోనే విడుదల కానుంది. ఈ చిత్రం నుండి ఇప్పటికే రిలీజ్ అయిన పాటలు, టీజర్ ఆకట్టుకున్నాయి.ఈ మూవీ తరువాత ‘టైగర్ నాగేశ్వరావు’ అనే చిత్రం కూడా చేస్తున్నాడు. ప్రస్తుతం రవితేజ మరో మల్టిస్టారర్ చిత్రంలో నటిస్తున్నట్టుగా వార్తలు షికారు చేస్తున్నాయి. ఆర్ఆర్ఆర్ మూవీ అనంతరం టాలీవుడ్ లో మల్టీస్టారర్ల సినిమాల హవా  పెరుగుతొందని చెప్పవచ్చు. రవితేజ, మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య మూవీ మంచి విజయాన్ని సాధించింది. ఈ క్రమంలోనే రవితేజ మరో మల్టిస్టారర్ సినిమాలో నటించడానికి రెడీ అవుతున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి.
ఇక  వాల్తేరు వీరయ్య సినిమాలో రవితేజ నటించినప్పటికి ఆ చిత్రానికి మెగాస్టార్ చిరంజీవి సినిమాగానే పేరు వచ్చింది అందువల్ల ఈసారి చేయబోయే మల్టిస్టారర్ చిత్రంలో యంగ్ హీరోతో కలిసి నటించడానికి రవితేజ ఒకే చేసినట్టు  సమాచారం. ఇక ఆ యంగ్ హీరో ఎవరో కాదు శర్వానంద్. ఇక ఈ చిత్రాన్ని తెరకెక్కించబోయేది ఒక యంగ్ టాలెంటెడ్ దర్శకుడు. ఆయన రవితేజ, శర్వానంద్ లకు కథ చెప్పాడంతో ఇద్దరికి ఆ కథ నచ్చిందంట. స్టోరీ ఐడియా కొత్తగా ఉండటంతో ఇద్దరూ అంగీకరించినట్లు తెలుస్తోంది.
Also Read: ఏంటి తమన్ అన్నా ఇది..? రామ్ చరణ్ “గేమ్ ఛేంజర్” మ్యూజిక్ ట్యూన్ కూడా కాపీయేనా..?

 


End of Article

You may also like