రాబిన్ హుడ్ పై ఇప్పటికే కథలు, సినిమాలు, సిరీస్ లు ఎన్నో వచ్చాయి. ధనికుల డబ్బుని దోచుకొని,పేదవారికి పంచి పెట్టె ఒక దొంగనే రాబిన్ హుడ్. హాలీవుడ్ చిత్రాలతో రాబిన్ హుడ్ పేరు ఎంతగానో పాపులర్ అయింది. ఇక అలాంటి స్టోరీనే త్వరలో తెలుగులో రాబోతుంది. అదే మాస్ మహారాజ రవితేజ హీరోగా నటిస్తున్న టైగర్ నాగేశ్వరరావు సినిమా. ఇది పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతోంది. అయితే ఇది హాలీవుడ్ రాబిన్ వుడ్ కథ కాదు. ఆంధ్రా రాబిన్ వుడ్ గా పేరు గాంచిన గరిక నాగేశ్వరరావు కథ.

Video Advertisement

ఈ సినిమా ఆంధ్రప్రదేశ్ లో జరిగిన వాస్తవ జీవితం ఆధారంగా రూపొందుతోంది. ఆంధ్రప్రదేశ్ లోని బాపట్ల దగ్గరలో ఉండే స్టువర్టు పురం దొంగ గరిక నాగేశ్వరరావు జీవితం కథే టైగర్ నాగేశ్వరరావు సినిమా. గరిక నాగేశ్వరరావు ఆకక్డి వారు టైగర్ అని కొందరు, మరికొందరు ఆంధ్ర రాబిన్ హుడ్ అని పిలుస్తుంటారు. అప్పట్లో నాగేశ్వరరావు తెలుగు రాష్ట్రాల్లో, ఒరిస్సా వంటి రాష్ట్రాల్లోనూ దొంగతనాలు చేయడంలో బాగా పేరూ పొందాడు.

ఆయన మీద ఎన్నో దొంగతనాలు, ఇతర నేరాల్లో కేసులు ఉండేవి. ఇప్పుడు అలాంటి వ్యక్తి పేరుతో సినిమా రూపొందడం చర్చనీయాంశంగా మారింది. అది కూడా రవితేజ హీరోగా టైగర్ నాగేశ్వరరావు పేరుతో బయోపిక్ అన్నప్పటి నుండి అతని పై చర్చ మొదలైంది. ఇంతకీ ఎవరి ఆంధ్రా రాబిన్ హుడ్? అతనికి ఆ పేరు ఎలా వచ్చింది. గరిక నాగేశ్వరరావు ఎలా టైగర్ నాగేశ్వరరావుగా మారారు అనేది ఇప్పుడు చూద్దాం.ముగ్గురు అన్నదమ్ముల కథ:
కొంపల్లే సుందర్ అనే పరిశోధకుడు టైగర్ నాగేశ్వరరావు జీవితం పై పరిశోధన చేశారు. అయితే ఈ పరిశోధనలో ఎన్నో ముఖ్యమైన విషయాలు బయటకు వచ్చాయి. టైగర్ నాగేశ్వరరావు గా పాపులర్ అయిన వ్యక్తి నిజమైన పేరు గరిక నాగేశ్వరరావు. ఇతనికి ఇద్దరు సోదరులు ఉన్నారు. నాగేశ్వరరావుకు అన్నయ్య పేరు ప్రభాకర్, ఆయన తమ్ముడు పేరు ప్రసాద్ ఉన్నారు. వీరిది స్టువర్టుపురం. ఈ అన్నదమ్ములు ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉన్న సమయంలో వారి చుట్టూ ఉన్నవారు తమని పట్టించుకోలేదని, కనీసం మనుషులుగా కూడా చూడలేదనే కారణంతో వీరు దొంగతనాలను మొదలు పెట్టారు.

వారిని మనిషులుగా గుర్తించక పోవడం వల్ల నేర జీవితాన్ని ఎంచుకొని వారు బాటలో కొనసాగారు. అప్పటి ఉమ్మడి ఏపీతో పాటు ఛత్తీస్ ఘడ్, ఒరిస్సా లాంటి రాష్ట్రాల్లో ఈ ముఠా భారీ దొంగతనాలకు చేసేవారు. దాంతో ఆ రాష్ట్రాల్లో ఈ ముగ్గురిపై తీవ్రమైన నేరారోపణలు, అనేక దొంగతనాలు చేసిన కేసులు కూడా నమోదు చేశారు. ఈ దొంగతనాలలో 1973లో బనగానపల్లిలో జరిగిన దొంగతనం అప్పట్లో సంచలనం అయ్యింది.మార్పు తీసుకువచ్చే ప్రయత్నం:
అప్పటికే వీరు స్టువర్టుపురం దొంగలుగా పాపులర్ అయ్యారు. అయితే వీరిలో మార్పు తీసుకురావడానికి నాస్తిక సొసైటీకి చెందిన హేమలత మరియు ఆమె భర్త లవణం ఎంతగానో ప్రయత్నించారు. ఈ భార్యాభర్తలు చేసిన ప్రయత్నాల్లో భాగంగా ఎన్నో కార్యక్రమాలు నిర్వహించారు. దాంతో వారిలో కొద్దిగా మార్పు కనిపించింది. అలా వారు పరివర్తన చెందినప్పటికీ కొన్ని కారణాలతో మళ్లీ దొంగతనాలు వైపుకే నాగేశ్వరరావు ముఠా వెళ్ళింది.పోలీసుల కాల్పుల్లో మరణం:
దొంగతనాలు కేసులలో మరియు తీవ్రమైన నేరాలలో నిందితులుగా ఉన్న ఈ ముఠా కోసం పెద్ద ఎత్తున పోలీసులు గాలించేవారు. అలా గాలించే క్రమంలో 1980లో జరిగిన పోలీసుల కాల్పుల్లో టైగర్ నాగేశ్వరరావు చనిపోయాడు. మరణించే సమయానికి టైగర్ నాగేశ్వరరావు వయసు 27 సంవత్సరాలు మాత్రమే. అయితే అతనిలో పరివర్తన వచ్చిన అనంతరం మళ్ళీ దొంగతనాలు చేయకుండా ఉంటే అతను మరణించేవాడు కాదని పరిశోధకుడు సుందర్ వెల్లడించారు.

ఎన్నో సార్లు టైగర్ నాగేశ్వరరావు మీద కాల్పులు జరిగినా ఆయన తప్పించుకొని బయటపడ్డారని సుందర్ తెలిపారు. ప్రభుత్వం వీరిలో మార్పు తీసుకురావడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలితం లేకపోవడంతోనే కాల్పులు జరిపేలా చర్యలు తీసుకుందని ఆయన తన పరిశోదనలో వెల్లడించారు.

టైగర్ నాగేశ్వరరావు సమాధి – ఆర్చ్:
స్టువర్టుపురం ప్రాంతంలో ప్రస్తుతం టైగర్ నాగేశ్వరరావు సమాధి మరియు వీరిలో మార్పుకు ప్రయత్నించిన హేమలత, ఆమె భర్త లవణంపేరుతో ఉన్న ఆర్చ్ కూడా కనిపిస్తుంది. అయితే ఒకానొక సమయంలో నాగేశ్వరరావు ముఠా హేమలత, లవణం జంటను తమ తల్లిదండ్రులుగా కూడా భావించిందంట. వారు చెప్పిన మాటలు వింటూ వారు చెప్పిన పనులు మాత్రమే చేస్తూ మార్పు వైపుకు అడుగులు వేసినవారు.

మళ్లీ దొంగతనం వైపుకి వెళ్లడంతో ప్రాణాలు పోగొట్టుకున్నారని సుందర్ తెలిపారు. ప్రస్తుతం స్టువర్టుపురంలో దొంగతనాలకు స్థానం లేదని, ఇక్కడ ఉండే యువత విద్యాధికులు అవడంతో పరిస్థితులన్ని పూర్తిగా మారాయి. ఇక్కడి యువత ఉద్యోగ ప్రయత్నాలు చేస్తుండడంతో నేరాలు పూర్తిగా తగ్గాయి.ఇది ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ను ఊపేసిన స్టువర్టుపురం దొంగల కథ.
ఇక నాగేశ్వరరావు అన్న ప్రభాకర్ రావు ఆ ప్రాంతంలో జీవిస్తున్నారు.ప్రభాకర్ రావు తమ్ముడి గురించి చెబుతూ ఆయనకు టైగర్ అనే పేరును తమిళనాడు వాళ్లు పెట్టారని, అది అలాగే స్థిరపడిపోయిందని ఆయన తెలిపారు. తన తమ్ముడు కన్నా తనే ముందు దొంగగా మారాను అని, అప్పటికే 2 ఎకరాల భూమి కొనుక్కున్నట్లు తెలిపారు. టైగర్ నాగేశ్వరరావు, ప్రభాకర్ రావు తమిళనాడులో కూడా దొంగతనాలకు చేసేవారు.

టైగర్ నాగేశ్వరరావు పేరుతో తెరకెక్కుతున్న సినిమాలో ఎలాంటి అంశాల్ని చూపించబోతున్నారో అని స్టువర్టుపురం ప్రజల నుండి భిన్నమైన అభిప్రాయాలు వస్తున్నాయి. ఆ సినిమా వాళ్లు నాతో మాట్లాడి, నాగేశ్వరరావు గురించిన వివరాలు తెలుసుకున్నారు. అయితే సినిమాలో వారి అవసరం కోసం లేనివాటిని కొన్నింటిని చూపించే అవకాశం కూడా ఉంటుంది. జరిగిన దానిని వక్రీకరించకూడదని అని ప్రభాకర్ రావు తెలిపారు.
శారద అనే మహిళ మాట్లాడుతూ, మేం చదువుకునే సమయంలో స్టువర్టుపురం అనగనే మమ్మల్ని భిన్నంగా, తప్పుగా చూసేవారు. ఆ విధానం ఇప్పుడిప్పుడే మెల్లగా తగ్గుతోంది. మా గ్రామంలో ఎన్నో మార్పులు వచ్చాయి. పెద్ద చదువులు అభ్యసించి చాలా మంది మంచి స్థానాల్లో స్థిరపడ్డారు. మళ్లీ అప్పటి స్టువర్టుపురం కథ చెప్పి, నేటి తరం జీవితాల మీద ఆనాటి మచ్చ పడకుడదని, మా పిల్లలను అందరూ అనుమానించే స్థితి రాకూడదని అన్నారు. శారద ప్రస్తుతం చెన్నైలో ఐటీ రంగంలో చేస్తున్నానని, ఇలాంటి చిత్రాల వల్ల అపోహలు పెరిగే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్నారు.

Also Read: 2014 లో ”కీరవాణి” ఆ తప్పు చేసి ఉంటే… ఈరోజు ఆస్కార్ వచ్చేదే కాదు…!