మాస్ మహారాజ్ రవితేజ హీరోగా వస్తున్న పవర్ఫుల్ మాస్ అండ్ యాక్షన్ మూవీ ధమాకా. శ్రీ లీల ఈ మూవీలో హీరోయిన్ గా నటిస్తోంది. త్రినాథ రావు నక్కిన డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టిజి విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఇప్పటివరకు రవితేజ కెరియర్ లో వచ్చిన అన్ని మూవీస్ తో పోలిస్తే హై బడ్జెట్ మూవీ గా ధమాకా రూపుదిద్దుకుంటుంది.

Video Advertisement

ఆల్రెడీ రిలీజ్ అయిన టీజర్ మరియు సాంగ్స్ మంచి పాజిటివ్ రెస్పాన్స్ ను సంపాదించాయి. డిసెంబర్ 23 న ఈ మూవీ రిలీజ్ కి సిద్ధమవుతోంది. ఈ ఇయర్ రిలీజ్ అయిన రవితేజ మూవీస్ రెండు బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్స్ గా మిగిలాయి. ఖిలాడి , రామారావు ఆన్ డ్యూటీ మూవీస్ అనుకున్న ఫలితాలు రానప్పటికీ ధమాకా నాన్ థియేట్రికల్ బిజినెస్ మాత్రం బ్రహ్మాండంగా జరిగింది.

తెలిసిన సమాచారం ప్రకారం…ధమాకా నాన్ థియేట్రికల్ బిజినెస్ విలువ రూ.30 కోట్లు. ఈ మూవీ హిందీ డబ్బింగ్ రైట్స్ రూ.10 కోట్లు మరియు డిజిటల్ మరియు శాటిలైట్ హక్కులు, ఆడియో రైట్స్ అన్నీ కలుపుకుని మరో రూ.20 కోట్లు బిజినెస్ జరిగింది. రవితేజ మాస్ యాక్షన్ కి అభిమానుల్లో మంచి క్రేజ్ ఉంది. రవితేజ మూవీ అంటేని మంచి పవర్ ఫుల్ పంచ్ డైలాగ్స్ మరియు మైండ్ బ్లోయింగ్ ఫైట్ సీన్స్ తో మూవీ ఇరగదీస్తుంది.

netizens comments on these mistakes in ramarao on duty movie
త్రినాథ్ రావు నక్కిన మూవీ పై ఉన్న భరోసా కూడా ఈ మూవీ కి ప్లస్ పాయింట్ గా నిలిచింది. పైగ రీసెంట్ గా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణం లో వచ్చిన కార్తికేయ 2 బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసింది. కాబట్టి తిరిగి ఆ బ్యానర్ లో వస్తున్న ధమాకా మూవీపై కూడా అంచనాలు విపరీతంగా పెరిగాయి.దాంతో ఈ మూవీకి భారీ ఎత్తున బిజినెస్ జరిగినట్లు ఇండస్ట్రీ వర్గాలు అభిప్రాయ పడుతున్నాయి.