Ads
ఈ మధ్య నిజ జీవిత సంఘటనల ఆధారంగా సినిమాలు రావడం ఎక్కువగా జరుగుతోంది. గతంలో కూడా ఇలాంటి నిజ జీవిత సంఘటనల ఆధారంగా సినిమాలు వచ్చాయి కానీ, చారిత్రాత్మక నేపథ్యం ఉన్న సినిమాలు మాత్రం తక్కువగా వచ్చాయి. కానీ ఇప్పుడు టెక్నాలజీ పెరగడంతో అప్పటి పరిస్థితులని ఇప్పుడు చూపించడం అనేది సులువుగా అవుతోంది. ఈ కారణంగానే చరిత్రలో నిలిచిపోయిన ఎన్నో కథలని ఇప్పుడు ప్రేక్షకుల ముందుకి తీసుకొస్తున్నారు. ఇటీవల అలా హైదరాబాద్ గురించి చూపించిన సినిమా రజాకార్.
Video Advertisement
నిజ జీవిత సంఘటనల ఆధారంగా రూపొందించిన ఈ సినిమాలో, బాబీ సింహ, అనసూయ భరద్వాజ్ వంటి వారు ముఖ్య పాత్రల్లో నటించారు. 1948 ప్రాంతంలో జరిగిన సంఘటనలని ఈ సినిమాలో చూపించారు. ఈ సినిమా బడ్జెట్ 50 కోట్లు. గత శుక్రవారం ఈ సినిమా విడుదల అయ్యింది. మొదటి వీకెండ్ లో ఈ సినిమా వరల్డ్ వైడ్ గా 1.4 కోట్ల రేంజ్ లో గ్రాస్ చేసింది. 80 లక్షల షేర్ సొంతం చేసుకుంది. ప్రస్తుతం వర్కింగ్ డేస్ అవ్వడం కారణంగా సినిమా కాస్త నెమ్మదించింది. కానీ గత వారం విడుదల అయిన సినిమాలతో పోలిస్తే ఈ సినిమా మాత్రం బాగా నడుస్తోంది.
మొత్తం మీద 80 లక్షల గ్రాస్ రావడంతో, బాక్సాఫీస్ దగ్గర 2.20 కోట్ల గ్రాస్ సొంతం చేసుకొని, 1.20 కోట్ల షేర్ వసూళ్ళని రాబట్టింది. మొత్తంగా ఈ సినిమా బిజినెస్ వాల్యూ 2 కోట్ల వరకు ఉంది. 2. 20 కోట్ల షేర్ టార్గెట్ అందుకోవాలి. ఇందులో ఇప్పుడు ఇంకొక కోటి రూపాయల షేర్ ఇంకా రావాల్సి ఉంది. సినిమా రికవరీ అవ్వాలంటే మాత్రం ఇంకా చాలా వసూలు చేయాలి. ఒకవేళ నాన్ థియేట్రికల్ రైట్స్ కలిపినా కూడా రికవరీ బడ్జెట్ వరకు వెళుతుందా లేదా అనేది చెప్పడం కష్టం.
కానీ కొన్ని సినిమాలు థియేటర్లలో కంటే కూడా ఓటీటీలో విడుదల అయినప్పుడు మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంటున్నాయి. ఎన్నో కారణాల వల్ల థియేటర్లోకి వెళ్ళలేని ప్రేక్షకులు, డిజిటల్ రిలీజ్ అయ్యాక చూసి, సినిమా గురించి సోషల్ మీడియా ద్వారా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా కంటెంట్ ఓరియంటెడ్ సినిమా కాబట్టి డిజిటల్ రిలీజ్ అయ్యాక ఎక్కువ మంది చూసి సినిమా గురించి మాట్లాడే అవకాశం ఉంది. అలా చూసుకుంటే మాత్రం డిజిటల్ రిలీజ్ హిట్ అయ్యి అవకాశాలు గట్టిగా ఉన్నాయి. ప్రస్తుతం అయితే సినిమా థియేటర్లలో నడుస్తోంది.
End of Article