కేజిఎఫ్ 2, కే జి ఎఫ్2, కే జి ఎఫ్ 2 ప్రస్తుతం ఎక్కడ చూసిన దీని మేనియానే కనిపిస్తోంది. ఎవరి నోట్లో నుంచి మాట బయటకు వచ్చిన రాఖీ బాయ్ రాఖీ బాయ్ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.

Video Advertisement

మొదట్లో పుష్పా సినిమా వచ్చి తగ్గేదేలే అంటూ అందరి మన్ననలు పొందింది. తర్వాత త్రిబుల్ ఆర్ వచ్చి ప్రేక్షకుల మనసు దోచేసింది.

మళ్ళీ వెంటనే కేజిఎఫ్ 2 అభిమానుల మనసులు కొల్లగొడుతోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఈ మూవీ గురించి చర్చ సాగుతోంది. ముఖ్యంగా కే జి ఎఫ్ మూవీలో రాఖీ బాయ్ తల్లి పాత్రలో చేసిన యువతి ఫోటోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

తల్లి పాత్రలో అదరగొట్టిన ఆ నటి హీరో యష్ కంటే వయసులో చాలా చిన్నది. అయినా తన యాక్టింగ్ తో అదరగొట్టేసింది. మరి ఇంతకీ ఆమె ఎవరు.. వివరాలు తెలుసుకుందాం..!! కేజిఎఫ్ 2 సినిమాలో రాఖీ బాయ్ తల్లి పాత్రలో చేసిన అమ్మాయి అర్చనా జోయిస్. ప్రస్తుతం ఈమె ఫోటోలు సోషల్ మీడియాలో ట్రెండ్ గా మారింది.

27 సంవత్సరాల అర్చన హీరో యష్ కంటే తొమ్మిది సంవత్సరాలు చిన్నది. అయినా తల్లి పాత్రలో నటించడమే కాదు జీవించింది. అయితే సినిమాలో తల్లి పాత్రలో యష్ బాల్యంలో ఉన్నప్పుడు మాత్రమే ఆమె రోల్ కనిపిస్తుంది. అందుకే మూవీ యూనిట్ ఆమెను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.

ఈ మూవీ భారీగా హిట్ అవడంతో అర్చనకు మరింత పాపులారిటీ పెరిగిపోయింది. దీంతో ఆమెకు అనేక సినిమా ఆఫర్లు కూడా వస్తూన్నాయట. ఆమె రియల్ లైఫ్ లో ట్రెడిషనల్ గా కనిపించినా గాని రీల్ లైఫ్ లో మాత్రం ఎంతో గ్లామరస్ గా ఉండటానికి ఇష్టపడుతుందట.

ఒకవైపు కథానాయికగా చేస్తూ మరోవైపు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి మంచి పాత్రలు చేస్తోంది. ఈ మధ్య కాలంలోనే ఆమె రియల్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటే కుర్రకారు చూసి అమ్మో అంటూ ఆమెకు ఫిదా అయిపోతున్నారు.