యాచకురాలి నుంచి ఫస్ట్‌ ట్రాన్స్‌జెండర్‌ ఫొటో జర్నలిస్ట్‌ గా ఎదిగిన జోయా థామస్‌ గురించి ఈ విషయాలు తెలిస్తే కన్నీళ్లే..!

యాచకురాలి నుంచి ఫస్ట్‌ ట్రాన్స్‌జెండర్‌ ఫొటో జర్నలిస్ట్‌ గా ఎదిగిన జోయా థామస్‌ గురించి ఈ విషయాలు తెలిస్తే కన్నీళ్లే..!

by Anudeep

Ads

ఇటీవల ఫస్ట్‌ ట్రాన్స్‌జెండర్‌ ఫొటో జర్నలిస్ట్‌ గా నిలిచిన జోయా థామస్‌ ఎందరినో ఇన్స్పైర్ చేస్తున్నారు. ఈమె ఎవరా అని సెర్చ్ చేస్తే పలు ఆసక్తికర విషయాలు తెలుస్తున్నాయి. ఈ 27 మహిళ గత కొంతకాలం గా ముంబై లో యాచకురాలిగా ఉన్నారు. ఆమెకు ఫొటోస్ తీయడం అంటే ఎంతో ఇష్టం. కానీ.. కూడు కోసం తిప్పలు పడుతూ ఉన్న పరిస్థితిల్లో ఫోటో గ్రాఫర్ అవ్వడం అంటే కష్టమే.

Video Advertisement

joya 1

కానీ.. ఆమె సంకల్ప బలమే ఆమెను నేడు ఫస్ట్ ట్రాన్స్ జెండర్ ఫోటో జర్నలిస్ట్ గా నిలిచేలా చేసింది. అవును.. అతను ఆమె. తానొక ట్రాన్స్ జెండర్. అలా అనుకుని.. తానేమి చేయలేను అని దిగులు పడుతూ కూర్చోలేదు. తానూ ట్రాన్స్ జెండర్ అవడం తో ఇంట్లోని వారు.. చుట్టూ పక్కల వారు నిరాదరించడం తో దిక్కుతోచక రోడ్డుపై పడింది. తనలానే రోడ్డున పడ్డ కొందరు హిజ్రా లతో కలిసి రైళ్లలోనే యాచించేది.

joya 2

ఓ సారి 2018 లో ఓ షార్ట్ ఫిలిం డైరెక్టర్ హిజ్రా నటుల కోసం వెతుకుతున్నట్లు తనకు తెలిసింది. వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకోవాలనుకుంది. అలా ఆ సినిమాలో ఓ పాత్రలో నటించింది. ఆ తరువాత ట్రాన్స్ జెండర్ ల కష్టాల మీదే తీసిన మరో సినిమాలోనూ నటించింది. ఆ సందర్భం గా ఓ సమావేశం లో జోయా పాల్గొంది. అక్కడ పలువురు వక్తలు ట్రాన్స్ జెండర్ల కష్టాల గురించి వారిని వెలివేయడం అన్యాయం అంటూ ప్రసంగించారు.

joya 4

ఆ సందర్భం గా జోయా తన కష్టాలను, తానూ ఎదురుకొన్న పరిస్థితులను కూడా వివరించింది. ఆ సమావేశానికి హాజరు అయినా ఓ పత్రిక సంపాదకుడు ఆమెకు ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ గా అవకాశం ఇచ్చాడు. అలా మొట్ట మొదటిసారి ఆమె పత్రిక ఆఫీస్ లోకి వెళ్ళింది. అక్కడ కెమెరాలను చూసి ముచ్చటపడింది. ఆమెకు ఉన్న అభిరుచి, కఠోర శ్రమ తో కళ్ళకు కట్టినట్లు గా ఫోటోలను తీయడం నేర్చుకుంది.

joya 3

గతేడాది లాక్ డౌన్ సమయం లో బాంద్రా స్టేషన్ వద్ద చిక్కుకుపోయిన వలస కార్మికుల ఫోటోలను కూడా జోయా తీశారు. అవి విశేషం గా ఆకట్టుకున్నాయి. వాటితో ఆమెకు మంచి పేరు ప్రఖ్యాతలు లభించాయి గాని కూడు పెట్టలేదు. జర్నలిజం గురించి ఆమెకు పూర్తి గా తెలియకపోయినా.. కరోనా గడ్డు రోజుల్లో కెమెరా పట్టుకుని తిరిగి పని లో మెళకువలు నేర్చుకుంది. తనకంటూ సొంతం గా ఒక కెమెరా ఉండాలని కోరుకుంది.

joya 5

ఫ్రీలాన్సింగ్ లో వచ్చే మొత్తం చాలా తక్కువ. కూటి కోసం కూడా గతేడాది వరుకు జోయా రైళ్లలో యాచించాల్సి వచ్చింది. అలా యాచించగా వచ్చినంత మొత్తం లోనే కొంత దాచుకుంటూ ఓ కెమెరాను కొనుక్కుంది. వలసకార్మికుల ఫోటోలకు మంచి ప్రశంసలు వచ్చాక.. సీనియర్ జర్నలిస్ట్ లు కూడా మెచ్చుకున్నారు. పనులు కూడా వచ్చాయి. వారే తనకు లైసెన్స్ ఇవ్వడం తో పాటు సాంకేతికం గా మెళకువలు కూడా నేర్పించారని జోయా చెప్పుకొచ్చారు. తన గొంతు విప్పే అవకాశం వచ్చినప్పుడల్లా… ట్రాన్స్ జెండర్లను పక్కన పెట్టి వేలేయాల్సిన అవసరం లేదని.. వారికి కూడా అవకాశం ఇస్తే మంచి గా చదువుకుని ఉద్యోగాలు చేయగలరని చెబుతూ వస్తోంది జోయా.. ఆమె జర్నీ మరింత ఆదర్శం గా సాగాలని కోరుకుందాం.


End of Article

You may also like