మా అమ్మ బీడీలు చుట్టి మమ్మల్ని పెంచింది.. జబర్దస్త్ లో నవ్వించే ఫైమా నిజజీవితంలో కష్టాలు తెలిస్తే కన్నీళ్లే..

మా అమ్మ బీడీలు చుట్టి మమ్మల్ని పెంచింది.. జబర్దస్త్ లో నవ్వించే ఫైమా నిజజీవితంలో కష్టాలు తెలిస్తే కన్నీళ్లే..

by Anudeep

Ads

జబర్దస్త్ కామెడీ షోలో సరైన టైమింగ్ తో కామెడీ చేస్తూ వీక్షకులను అలరిస్తుంది పైమా. పటాస్ షో తో బుల్లితెర పై ఎంట్రీ ఇచ్చి ఎక్స్ట్రా జబర్దస్త్ షో తో బుల్లితెర ప్రేక్షకులకు ఎంత దగ్గర అయ్యింది. జబర్దస్త్ లోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే మంచి గుర్తింపు సంపాదించుకుంది.

Video Advertisement

బుల్లెట్ భాస్కర్, ఇమ్మాన్యుయెల్ చేసే కామెడీ స్కిట్ లో పాల్గొని తనదైన శైలిలో టైమింగ్ తో పంచులు వేస్తూ ప్రేక్షకులకు హాస్యాన్ని కలిగిస్తోంది. చాలా తక్కువ సమయంలోనే జబర్దస్త్ లో మంచి పాపులారిటీ పొందిన లేడీ కమెడియన్ ఆర్టిస్ట్ గా గుర్తింపు సంపాదించుకుంది.

 

అయితే ఈవిడ అసలు ప్రయాణం వెనక వేరే లక్ష్యం ఉందట. పైమా ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొందో, జబర్దస్త్ షో ద్వారా తన ప్రయాణం ఎలా మొదలయింది అనే విషయాలపై ఒక ప్రముఖ టీవీ ఛానల్ తో ఇంటర్వ్యూ ద్వారా తన అభిప్రాయాలను వెల్లడించింది. తమ తల్లి బీడీలు చుట్టి తమను పెంచిందని, అమ్మ కు వచ్చిన ఆ కొంచం డబ్బుతోనే తమకు ఏం కావాల్సిన కొని ఇచ్చేది అని చెప్పుకొచ్చింది. తన బిడ్డలు మంచి పేరు సంపాదించాలని మా అమ్మ ఎప్పుడూ కోరుకుంటూ ఉండేది అని చెప్పింది. మేము నలుగురు అక్కాచెల్లెళ్లం.  మాలో ముగ్గురికి చిన్నవయసులోనే పెళ్లిళ్లు కూడా అయిపోయాయి అని తెలియజేసింది.

అమ్మ ఎప్పుడు మంచి పేరు తెచ్చుకుని మెలగాలని చెబుతూ ఉండేది. అప్పుడు ఆవిడ మాటలు నాకు అర్థమయ్యేవి కాదు. తర్వాత మల్లెమాల ద్వారా నేను మంచి పేరు సంపాదించుకున్నాను. అప్పుడప్పుడు మాటల్లో ఆంతర్యం ఏమిటో నాకు అర్థం అయ్యింది. అమ్మ కల నెరవేరింది అని తెలిసింది.

ఈ ఇంటర్వ్యూలో తల్లి పాలు తాగి రొమ్ముగుద్దే టైప్ అని అవినాష్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన షేకింగ్ శేషుపై , ఈ స్థాయిలో ఉన్నారు అంటే ఎవరి వలన ఎదిగాము అన్న విషయాన్ని మరిచిపోకూడదు.. అంటూ హితవు చెప్పారు ఫైమా.

జబర్దస్త్ లో రాకముందు నాకు పెద్దగా ఆశలు ఉండేవి కాదు. చదువులో కూడా వెనకబడి ఉండేదాన్ని. బట్టలు కొట్టుకుంటూ జీవన సాగించాలని నిర్ణయించుకున్నాను అప్పటిలో. నా అదృష్టం కొద్ది జబర్దస్త్ లో  అవకాశం వచ్చింది. నాకు చిన్నప్పటి నుంచి ఒక కోరిక ఉండేది. మా చిన్న వయసులో అద్దె ఇంట్లో ఉండేవాళ్ళం. ఇంటి వాళ్ళు వెళ్లిపోమంటే అక్కడి నుంచి ఖాళీ చేసి వెళ్ళిపోవలసి వచ్చేది. సరైన సదుపాయాలు కూడా ఉండేవి కాదు. అలానే సర్దుకు పోయేవాళ్ళం.

అమ్మ పని చేసుకుంటూ ప్రతి ఇల్లు మారుతూ ఉండేది. అమ్మ పడుతున్న ఈ కష్టాలు చూసేవాళ్ళం కాబట్టి అమ్మకు ఇల్లు కట్టి ఇవ్వాలని ఆ నలుగురు అక్క చెల్లెలు అనుకునేవాళ్ళం. ఇప్పుడు నాకు ఉండే ధ్యేయం.. అమ్మకు ఇల్లు కట్టి ఇవ్వడం  అని ఇంటర్వ్యూలో ఫైమా వెల్లడించారు.

Watch Video:


End of Article

You may also like