మంచు విష్ణు “జిన్నా” మూవీ ఫ్లాప్ అయినప్పటికీ అందులోని “జారు మిఠాయ” సాంగ్ మాత్రం సోషల్ మీడియాలో బాగా హిట్ అయిందని చెప్పవచ్చు. ఈ సాంగ్ మీద రీల్స్ గురించి అయితే చెప్పనక్కర్లేదు. జిన్నా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మోహన్ బాబు స్వయంగా “ఆవిడ మా ఊరు నుంచి వచ్చారు. పాట పాడుతారు” అని చెప్పే వరకు.. అసలు ఇలాంటి పాట ఒకటి ఉంటుంది అని చాలా మందికి తెలియదు.

Video Advertisement

లిరిక్స్ , వాయిస్ బాగున్నాయని కొందరు. సన్నీ లియోన్ సాంగ్ అని ఇంకొందరు, ఇదో కొత్త రకం మిఠాయి అనుకున్న వారు మరికొందరు. ఇలా చాలా మంది ఈ పాట పైన తవ అభిప్రాయాలను కూడా ఏర్పరచుకున్నారు.
జిన్నా మూవీ థియేటర్లోకి వచ్చి వెళ్లి చాలా కాలం అయినప్పటికీ ఈ పాట మాత్రం జనాల మైండ్ లో స్టాండర్డ్ గా మిగిలిపోయింది అని చెప్పొచ్చు.

ginna movie got profits through hindi dubbing rights..!!

సోషల్ మీడియా పుణ్యమా అని ఈ రోజుల్లో చాలా మంది టాలెంట్ సామాజిక మాధ్యమాల ద్వారా వెలుగులోకి వస్తోంది. అసలు ఈ పాట అర్థం ఏమిటి అన్న విషయంపై స్టేజి మీద పాడిన భారతీయ అనే మహిళను కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ఇంటర్వ్యూ కూడా చేశాయి. ఈ సందర్భంగా ఆమె ఈ పాట పుట్టుపూర్వోత్తరాల గురించి వివరంగా వివరించి చెప్పారు. భారతి చిత్తూరు జిల్లాలోని పారువాలు గ్రామం లో నివసిస్తారు. చిన్నతనంలో మేకలు, గొర్రెలు, కాయడానికి వెళ్ళినప్పుడు ఇలాంటి జానపద గేయాలను పాడేవాళ్ళమని.. అలా తాను కూడా ఇవి నేర్చుకున్నానని పేర్కొన్నారు.‘జంబలికిడి జారు మిఠాయి’ అనేది ఒక అమ్మాయి పేరట…మరి ‘మొగ్గలఖాలింగో’ అంటే.. అబ్బాయిలెవరు మన వైపు చూడట్లేదు అని అర్థమట.

ginna movie got profits through hindi dubbing rights..!!

అయితే ఈ పాట పాడినందుకుగాను మోహన్ బాబు తనకు 50 వేల రూపాయలు ఇచ్చారని ఆమె సంతోషంగా చెప్పారు. ఈ మధ్యకాలంలో వస్తున్న సినిమాలలో ఇలాంటి జానపద గేయాలకు ప్రాముఖ్యత పెరుగుతూ ఉంది.‘దారి చూడు దుమ్మూ జూడు మామ’, ” దాని పేరే సారంగదరియా…”ఇలా సినిమాలలో రిలీజ్ అయ్యి జానపద పాటలు సినిమాకే క్రేజ్ ను తెచ్చిపెట్టాయి.