Ads
జీవితం ఎవ్వరికీ పూల పాన్పు కాదు. ఒక్కొక్కరికీ ఒక్కో రీతిలో కష్టాలు వస్తూ ఉంటాయి. అయితే.. వాటిని ఎలా ఎదుర్కొంటాం అన్న దానిపై మన సమర్ధత ఆధారపడి ఉంటుంది. అన్ని సాఫీ గా సాగిపోతూ ఉన్న సమయంలో ఒక్కసారిగా వచ్చే కుదుపు మన జీవితంలో పెను మార్పులను తీసుకొస్తుంది.
Video Advertisement
అయితే.. ఆ కుదుపులకి ధీటుగా సమాధానం ఇచ్చిన ఈ అమ్మాయి పేరు ప్రకృతి గుప్తా. ప్రకృతి గుప్తా హైదరాబాద్ లోనే పుట్టి పెరిగినా ఉన్నత చదువుల కోసం కెనడాకు వెళ్ళింది. అక్కడ యూనివర్సిటీ ఆఫ్ విండ్సర్‌లో అండర్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసాకా.. ఎంబీఏ ని కూడా పూర్తి చేసింది. క్రిజ్లర్ ఫైనాన్సియల్ కంపెనీలో ఉద్యోగం రావడంతో కెరీర్ ను ప్రారంభించింది. ఆ తరువాత, మెర్సిడెస్ బెంజ్ కంపెనీలో ప్రాజెక్ట్ లీడ్ గా ఆమెకు అవకాశం వచ్చింది.
ఆ తరువాత పెళ్లి చేసుకుని వర్క్ ప్లేస్ ని దుబాయ్ కి మార్చుకుంది. దుబాయ్ లోనే ఫియట్ క్రిజ్లర్ గ్రూప్ తో పని చేసింది. అంతా సాఫీగా సాగుతోంది అనుకుంటున్నా తరుణంలో అనారోగ్యం ఆమెను కుదిపేసింది. అనేక పరీక్షలు, చెకప్ ల తర్వాత ఆమెకు వచ్చిన వ్యాధి హాడ్గ్‌కిన్స్ లింఫోమా క్యాన్సర్ అని తెలిసింది. జీవితంపైనే ఆశలు వదిలేసుకుంటారు ఎవరైనా.. కానీ అక్కడ ఉన్నది ప్రకృతి గుప్తా. కాన్సర్ ని జయించడానికి వైద్యం ఒక్కటే సరిపోదు. ముందు మానసిక స్థైర్యం కూడా కావాలి.
ట్రీట్ మెంట్ తీసుకుంటున్న సమయంలో ప్రకృతి వర్మ చాలా కాలం విరామం తీసుకోవాల్సి వచ్చింది. ప్రకృతి వర్మ ఓ స్వీట్స్ వ్యాపారి. ఆయనే తన ఇన్స్పిరేషన్ అని ప్రకృతి వర్మ చెప్తూ ఉంటారు. ఆయనలా ఎంట్రప్రెన్యూర్ అవ్వాలని అనుకుంది. కానీ.. బిజినెస్ లో రిస్క్ లు ఎక్కువ ఉంటాయి అని.. ఆమెను ఉద్యోగంలో చేర్పించారు. అయితే.. ఇప్పుడు ట్రీట్ మెంట్ కోసం నాలుగు నెలల పాటు విరామం తీసుకోవాల్సి రావడంతో ప్రకృతి వర్మ చాలా ఆలోచించారు. ఆ నాలుగు నెలలో తెల్లని ఆసుపత్రి గోడల మధ్యే గడిపారు.
ఇలా రంగు వెలిసిన తన జీవితానికి తానె రంగులద్దుకోవాలని.. డిజైన్లు వేయాలని ప్రకృతి నిర్ణయించుకున్నారు. కొంచం కోలుకున్నాక 2011 లో కఫ్తాన్ కంపెనీ ని స్థాపించింది. ఈ కంపెనీ లో యాభై మంది మహిళలు పని చేస్తున్నారు. వారిలో 35 మంది మహిళలే. చాలా కంపెనీలలో వర్కింగ్ సెక్షన్ మహిళలు ఉన్నా.. పర్యవేక్షణ విభాగంలో పురుషులనే తీసుకుంటారు. కానీ మా కంపెనీలో కీలక రోల్స్ లలో కూడా మహిళలు పని చేస్తున్నారని ప్రకృతి గర్వముగా చెబుతుంది. మరోవైపు తండ్రి స్థాపించిన క్రాక్ హీల్ కంపెనీని కూడా నిర్వహిస్తున్నానని.. దానిని తండ్రి ఆల్రెడీ సక్సెస్ చేసి ఇచ్చారని.. అది రన్ చేయడం పెద్ద కిక్ ఉండదని.. కానీ “కఫ్తాన్” నా బ్రెయిన్ చైల్డ్.. దీనిని కూడా సక్సెస్ చేయడంలో కిక్ ఉంటుందని చెప్పుకొచ్చింది.
కఫ్తాన్ అంటే వదులుగా ఉండే చొక్కా.. ఇది పర్షియన్ భాషకి చెందిన పదం. మధ్యధరా ప్రాంతంలో నివసించే వారు ఇటువంటివి ధరిస్తారు. మన సైడ్ కూడా ఇటువంటి వాటిని నైట్ డ్రెస్ లుగా ధరిస్తూ ఉంటారు. దానిని డిజైన్లు మార్చి పగలు కూడా ధరించగలిగే డ్రెస్ లుగా రూపొందించారు. ఒంటిపై వేసుకున్న డ్రెస్ ను రోజంతా కంఫర్ట్ గా ఉంచుకోగలగాలి.. డ్రెస్ ను అందంగా కనిపించేలా డిజైన్ చేయడం, మరోవైపు కంఫర్ట్ గా ఉండేట్లు చూడడంతోనే మా కంపెనీ సక్సెస్ ఉందని ప్రకృతి వర్మ చెప్పుకొచ్చారు. అనారోగ్యం నుంచి కోలుకున్న వెంటనే ఈ బిజినెస్ ను ప్రారంభించానని.. ప్రస్తుతం దీనిని సక్సెస్ చేయడమే నా లక్ష్యమని చెప్పుకొచ్చారు.
End of Article