ఉద్యోగం వదిలేసి 9 నెలలుగా గుడి ముందు పూలు అమ్ముకుంటున్న లేడీ కానిస్టేబుల్..ఆమె ఎందుకు అలా చేస్తున్నారు.?

ఉద్యోగం వదిలేసి 9 నెలలుగా గుడి ముందు పూలు అమ్ముకుంటున్న లేడీ కానిస్టేబుల్..ఆమె ఎందుకు అలా చేస్తున్నారు.?

by Anudeep

Ads

ప్రస్తుతం మనం ఉన్న పరిస్థితులలో ఎంత కాంపిటీషన్ ఉందో చూస్తూనే ఉన్నాం. ప్రైవేటు ఉద్యోగాలు దొరకడమే కష్టం గా ఉన్న ఈరోజుల్లో గవర్నమెంట్ ఉద్యోగం దొరకడం అంటే మాటలు కాదు. ఏళ్ల తరబడి సాధన చేసి, పరీక్ష పాస్ అయితే తప్ప ఉద్యోగం దొరికే అవకాశం తక్కువే. అలా కష్టపడి సంపాదించిన గవర్నమెంట్ ఉద్యోగాన్ని కాలదన్నుకుంది ఈ అమ్మాయి. అంతే కాదు తన కుటుంబాన్ని సైతం వదులుకుని పూలు అమ్ముకుంటోంది.

Video Advertisement

ఇంతకీ ఆమె రియల్ స్టోరీ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఛత్తీస్ ఘడ్ రాష్ట్రానికి చెందిన అంజనా సాహిస్ అనే ఈ అమ్మాయి కి రాయపూర్ పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా పని చేస్తుంది. దాదాపు తొమ్మిది నెలల క్రితం ఆమెను సిఐడి డిపార్ట్మెంట్ కు ట్రాన్స్ఫర్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. అయితే.. ఆ తరువాత నుంచి ఆ అమ్మాయి అదృశ్యమైంది. ఆమె కుటుంబ సభ్యులు కూడా కంగారు పడి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చారు.

anjana sahis

సిఐడి డిపార్ట్మెంట్ లో జాయిన్ అవడానికి ఆఫర్ లెటర్ వచ్చిన తరువాత ఆమె అదృశ్యమైంది. జాయిన్ అవ్వాల్సిన రోజు కూడా ఆమె కనిపించకపోవడంతో పోలీసులు ఈ కేసును సీరియస్ గా తీసుకున్నారు. ఆమె కోసం గాలించడం మొదలు పెట్టారు. చివరకు కొన్ని రోజుల క్రితమే ఓ గుడి వద్ద ఆమె పూలు అమ్ముతూ కనిపించింది. బృందావనం లో శ్రీ కృష్ణుని ఆలయం బయట ఆమె పూలు అమ్ముకుంటోంది.

సీఐడీ డిపార్ట్మెంట్ లో ఉద్యోగాన్ని వదిలిపెట్టి, పూలు అమ్ముతున్న ఆమెను చూసి పోలీసులు షాక్ అయ్యారు. అయితే, వారు ఆమెను తిరిగి డిపార్ట్మెంట్ కు రావాలని కోరగా.. ఆమె చెప్పిన సమాధానం విని పోలీసులు షాక్ అయ్యారు. తనకి అక్కడే మనఃశాంతి, ఆనందం లభిస్తున్నాయని తెలిపింది. ఆ బృందావనమే తన ఇల్లు అని.. అది విడిచిపెట్టి ఎక్కడికీ రాను అని చెప్పింది. ఆమె తన ఫోన్ ను కూడా స్విచ్ ఆఫ్ చేయడం తో ఆమె ఆచూకీ దొరకడం కష్టమైంది. కొన్ని రోజుల క్రితమే ఆమె ఏటీఎం లో నుంచి డబ్బులు డ్రా చేయడం తో పోలీసులు ఆమె ఆచూకీని ట్రేస్ చేసారు.


End of Article

You may also like