Ads
అందరికి అన్ని లభించవు. కానీ, తమ వద్ద ఉన్నవాటిలో సంతోషం వెతుక్కోవడం అనేది చాలా తక్కువ మంది చేయగలుగుతారు. అలాంటి వారిలో మలీశా ఒకరు. ఆమె స్ఫూర్తి కి హాలీవుడ్ , బాలీవుడ్ తారలు సైతం ఫిదా అవుతున్నారు. ప్రముఖ హాలీవుడ్ నటుడు రాబర్ట్స్ హోఫ్‌మన్ ద్వారా మలీశా ప్రపంచానికి పరిచయం అయ్యారు. ఆమె ఎవరో.., ఆమె కథ ఏంటో ఓ సారి చూద్దాం.
Video Advertisement
మలీశా ముంబై లోని సముద్రపు ఒడ్డున ఓ మురికి వాడలో తన తండ్రి, తమ్ముళ్ళతో కలిసి నివాసం ఉంటోంది. అక్కడే, స్థానికం గా ఓ ప్రభుత్వ పాఠశాలలో ఏడవ తరగతి చదువుతోంది. చిన్న పిల్లే అయినా, మలీశా చదువులో బాగా రాణిస్తోంది. ఆమె ఇంగ్లీష్ లో కూడా అనర్గళం గా మాట్లాడగలదు. ప్రముఖ హాలీవుడ్ చిత్రం “ది స్ట్రీట్” లో నటించిన హాలీవుడ్ నటుడు రాబర్ట్స్ హోఫ్ మన్ ఓ సారి ఇండియా కి వచ్చినపుడు అనుకోకుండా మలీశా ను కలిశారు. ఆమె స్ఫూర్తి ని చూసి మెచ్చుకోకుండా ఉండలేకపోయారు. ఆమె ఫేస్ లో ఉన్న కళను చూసి మెచ్చుకుని, ఆమె కు “ప్రిన్సెస్ ఫ్రమ్ ది స్లమ్” అనే బిరుదుని కూడా ఇచ్చారు.
మంచి డాన్సర్ గా, మోడల్ గా రాణించాలన్నది మలీశా కల. అయితే, ఆమె తనను కలను నెరవేర్చుకోవడం కోసం.. రాబర్ట్స్ గో ఫండ్ మీ వెబ్ సైట్ సాయం తో విరాళాల సేకరణను కూడా మొదలు పెట్టారు. అలాగే, ఆమెకోసం ఓ ఇంస్టాగ్రామ్ ఖాతా ను కూడా తెరిచారు. అందులో ఆమె కు సంబంధించిన వీడియో లు, ఫోటోలను కూడా పోస్ట్ చేసారు. మలీశా కూడా స్థానికం గా ఉన్న తన స్నేహితుల సాయం తో కొన్ని వీడియో లు చేసింది. మురికి వాడలో ఉండే వారి జీవితం గురించి కొన్ని వీడియో లను యు ట్యూబ్ లో పోస్ట్ చేసింది. ఆమె ఇంస్టాగ్రామ్ ఖాతా కు కూడా చాలామందే ఫాలోవర్లు ఉన్నారు. దాదాపు అరవైవేలమంది వరకు మలీశా కు ఫాలోవర్లు ఉన్నారు. వీరిలో దియామీర్జా, అదితిరావు చౌదరి వంటి సినీ ప్రముఖులు కూడా ఉండడం విశేషం.
ఇటీవలే, మలీశా ఓ ఫ్యాషన్ మ్యాగజైన్ కోసం ఫోటో షూట్ లోకూడా పాల్గొంది. ఈరోజుని తన జీవితం లో ఎప్పటికి మర్చిపోలేనని మలీశా చెప్పుకుంది. అయితే,ఆమె కష్టాలు ఇంకా తీరలేదు. వారు ఉండే ఇంట్లో కొన్ని ఇబ్బందులని ఎదుర్కొంటున్నారు. తన తండ్రి, తమ్ముడు కోసం ఆమె చేయగలిగిన పనులన్నిటినీ చేస్తోంది. కొన్ని కొన్ని సార్లు పనులు దొరక్కపోతే.. ఖాళీ కడుపుతోనే పడుకున్న రోజులు కూడా మలీశా జీవితం లో చాలానే ఉన్నాయి.
అలాగే, తన తండ్రి, తముళ్లకోసం ఉండడానికి ఓ ఇల్లు ఉంటె బాగుంటుంది అని మలీశా అనుకుంటూ ఉంటుంది. అయినప్పటికీ, ఇప్పుడు తాము ఉంటున్న ఇల్లు కూడా ఎంతో ఇష్టమని చెబుతుంటుంది. కానీ, వర్షాకాలం వచ్చినపుడు మాత్రం వీరు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. దోమలు ఎక్కువ గా ఉండడం వల్ల కూడా వీరు ఇబ్బందులు పడుతున్నారు. ఇన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ, మలీశా ముఖం లో అసహనం కనిపించదు. తన కలను నెరవేర్చుకోవడానికి తాను పడుతున్న తపన మాత్రమే కనిపిస్తుంది. మలీశా తప్పకుండా తన కలను నెరవేర్చుకోవాలని కోరుకుందాం.
End of Article