మైనర్ బాలికపై రేప్ కేసుని ఛేదించిన లేడీ సింగం…సముద్రాలు దాటి దాక్కున్న వాడిని లాకప్ లోకి ఈడ్చుకొచ్చిన ఐపీఎస్.!

మైనర్ బాలికపై రేప్ కేసుని ఛేదించిన లేడీ సింగం…సముద్రాలు దాటి దాక్కున్న వాడిని లాకప్ లోకి ఈడ్చుకొచ్చిన ఐపీఎస్.!

by Anudeep

ఓ సింహం సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ నిజాయితీ గా పని చేస్తే ఎలా ఉంటుందో సింగం సినిమా లో చూసాం. మెరిన్ జోసెఫ్ కూడా అలాంటి లేడీ సింగమే. అసలు సిసలు ఖాకి చొక్కా తొడిగిన లేడీ సింగం ఆమె. ఆమె పెండింగ్ కేసుల ఫైల్స్ తెరిచిందంటే కేసు క్లోజ్ చేసే వరకు నిద్రపోదు. అలాంటి ఓ క్లిష్టమైన కేసును మెరిన్ జోసెఫ్ ఛేదించింది.

Video Advertisement

merin josef feature

దేశాలు దాటి వెళ్లిపోయిన నిందితుడిని పరాయి దేశం లోనే అరెస్ట్ చేసి తీసుకొచ్చి జైల్లో పడేసింది. వివరాల్లోకెళితే, మెరిన్ జోసెఫ్ కేరళకు చెందిన ఐపీఎస్ ఆఫీసర్. 2012 బ్యాచ్ ఐపీఎస్ ఆఫీసర్ ఆమె. ఇటీవలే ఆమె కేరళ రాష్ట్రం లో కొల్లంలో కమిషనర్ గా ఆమె బాధ్యతలు స్వీకరించింది. పాత కేసుల తాలూకు ఫైల్స్ అన్నిటిని ఓపెన్ చేసింది. వాటిలో ఓ బాలికపై లైంగిక దాడి, అత్యాచారం కేసు ను చూసి ఆమె చలించిపోయింది. అయితే ఆ బాలిక ప్రస్తుతం ఈ లోకం లో లేకపోయినప్పటికీ ఆమెకు న్యాయం చేయాలనీ నిర్ణయం తీసుకుంది.

merin josef 2

ఈ కేసు ఏమిటంటే, ఓ మైనర్ బాలికను సునీల్ కుమార్ బర్దన్ అనే ఓ దుర్మార్గుడు దాదాపు మూడు నెలల పాటు లైంగికం గా వేధిస్తూ , తన కోరికలను తీర్చుకున్నాడు. అతని పై ఆ బాలిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు కూడా చేసాడు. పోలీసులు అతడిని పట్టుకోలేకపోయారు. ఈ లోపు ఆ దుర్మార్గుడు దేశాన్ని వదిలి దుబాయ్ కి వెళ్లిపోయారు. పోలీసులు కూడా ఈ కేసును పట్టించుకోవడం మానేశారు.

merin josef

ఆ బాలిక జరిగినదని తలుచుకుని, అవమానం భరించలేక ఆత్మహత్య చేసుకుంది. కొన్ని రోజులకు ఆ బాలిక తండ్రి కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ కేసుని టేక్ అప్ చేసిన మెరిన్ జోసెఫ్ ఎలాగైనా అతడిని చట్టపరం గా శిక్షించాలనుకుంది. అతడిని తిరిగి భారత్ రప్పించడానికి ఆమె చేయని ప్రయత్నం లేదు. ఢిల్లీ లో సీబీఐ వద్ద మొదలుపెట్టిన దర్యాప్తు దుబాయి లోని ఇండియన్ ఎంబసీ వరకు కొనసాగింది.

merin josef 1

కానీ, ఒక్కరు ఆమెకు సహకరించలేదు. నీకెందుకింత పర్సనల్ ఇంట్రస్ట్ అన్న వెకిలి ప్రశ్నలే తప్ప ఎవరి వద్ద నుంచి ఆమెకు సహకారం అందకపోవడం తో.. తానే ఓ టీం ను తీసుకుని దుబాయి కి వెళ్ళిపోయింది. అక్కడ ఇండియన్ ఎంబసీ అధికారులను కలిసి పరిస్థితిని వివరించి.. ఆ నీచుడిని అక్కడే అరెస్ట్ చేసింది. ఆ తరువాత తీసుకొచ్చి కేరళ జైల్లో పడేసింది. అక్కడితో శాంతించలేదు. ఆ నీచుడి పై పర్ఫెక్ట్ ఛార్జ్ షీట్ ను ప్రిపేర్ చేసింది. బెయిల్ కి కూడా వీలు లేని విధం గా సెక్షన్లను జత చేసింది.

merin josef 4

ఈ కేసు లో ఆ నిందితుడి కి త్వరలోనే శిక్ష పడనుంది. ఆ బాలిక బతికే ఉంటె తనకు జరగబోయే న్యాయం పట్ల సంతృప్తి చెందేదేమో. ఇలాంటి అఘాయిత్యాలు మళ్ళీ మళ్ళీ జరగకుండా ఉండాలి అంటే.. మెరిన్ జోసెఫ్ లాంటి పోలీస్ సింహాలు ఉండాల్సిందే. ఓ పోలీస్ ఆఫీసర్ సిన్సియర్ గా పని చేస్తే ఎలా ఉంటుందో..మెరిన్ జోసెఫ్ నిరూపించింది.


You may also like