Ads
ప్రపంచం మొత్తంలో మన వ్యక్తిగత ప్రశ్నలకు సమాధానం దొరికే ఒక మంచి ఫ్లాట్ ఫామ్ కోరా. మనం అడిగే ప్రశ్నలకు ఇక్కడ మంచి సమాధానాలు దొరుకుతుంటాయి. కోరా ద్వారా ఒక వ్యక్తి ఈ విధంగా ప్రశ్నలు వేశారు. ప్రశ్న ఏంటంటే నిజమైన ప్రేమకు మరియు ఆకర్షణ కు మధ్య ఉన్న తేడా ఎలా తెలుసుకోగలం. నిజమైన ప్రేమ అనేది అసలు ఎలా ఉంటుంది అంటూ ప్రశ్న వేశారు.
Video Advertisement
ఈ ప్రశ్నకు సమాధానంగా నివ్య మందోథింగల్ అనే కోరా యూజర్, తన ప్రొఫైల్ ద్వారా ఆమె జీవితంలో జరిగిన ప్రేమ గురించి మధుర అనుభవాన్ని ఈ విధంగా పంచుకున్నారు.
ఇది తెలుసుకోవడం చాలా సులభం మీ ఆకర్షణ ఎప్పటికీ చనిపోకపోతే మీరు దాని ప్రేమ అని పిలవచ్చు. 2007వ సంవత్సరంలో మొదలైంది మా ప్రేమ కథ. అతను నాకు మొదటిగా పరిచయమైన అతనికి ఎలాంటి విద్యార్హత లేదు. అయినా అతనిపై నాకు 100% ప్రేమ ఉంది. ఆయన గ్రాడ్యుయేషన్ పూర్తి చేసినప్పుడు, ఉద్యోగం వచ్చినప్పుడు, ఉద్యోగ పోయినప్పుడు నాకు అతనిపై అంతే ప్రేమ ఉంది. నా ప్రేమ లో ఎటువంటి హెచ్చు తగ్గులు లేవు. ఆయన మా ప్రేమ గెలవాలి అంటే మంచి ఉద్యోగం ఉండాలని ఆలోచించి ఎంతో కష్టపడి పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో జాబ్ తెచ్చుకున్నారు.
ఆ తర్వాత పెళ్లి కోసం మా వాళ్ళని ఒప్పించారు. 2016 లో మా పెళ్లి అయ్యింది. పాప పుట్టడంతో మాకు ప్రేమ ఇంకా ఎక్కువైంది గానీ, కొంచెం కూడా తగ్గలేదు. 2007 లో మొదలైన మా ప్రేమ రోజురోజుకు పెరుగుతూనే వచ్చింది గానీ, ఎక్కడ ఇప్పటివరకు కొంచెం కూడా తగ్గలేదు. నిజమైన ప్రేమ అనేది జీవితాంతం ఒకే విధంగా ఉంటుంది. అదే ఆకర్షణ అనేది కేవలం అవసరానికి మాత్రమే ఉంటుంది అంటూ తన సమాధానం వెల్లడించారు నివ్య.
article sourced from: quora
End of Article