Ads
క్రికెట్ క్లబ్స్ లో అతి రిచెస్ట్ క్లబ్ గా కొనసాగుతున్న బీసీసీఐ ప్రతి సంవత్సరం ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఐపిఎల్ ఈసారి భారత్ లో ఉన్న కరోనా ఉధృతిని దృష్టిలో ఉంచుకొని యూఏఈలో జరపాలని నిర్ణయించింది. ఈ సంవత్సరం మొదట్లో T20 కప్ ను దృష్టిలో ఉంచుకొని చాలామంది ఫారెన్ ప్లేయర్స్ ఐపీఎల్ లో పాల్గొనమని ప్రకటించారు. తాజాగా ఐసీసీ T20cup వాయిదా వేయడంతో ఐపీఎల్ కు మార్గం సుగమమైంది.
Video Advertisement
గతంలో కూడా ఐపీఎల్ లోని కొన్ని మ్యాచ్ లు యూఏఈలో నిర్వహించారు.అది ఎందుకో ఎప్పుడో తెలుసా?2014 ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఐపీఎల్ లోని కొన్ని మ్యాచ్ లను యూఏఈలో నిర్వహించారు.ఆ సీజన్లో కలకత్తా నైట్ రైడర్స్ కప్ ను గెలిచారు.ఆ సీజన్లో అందరికీ షాక్ ఇచ్చే విధంగా డిఫెండింగ్ చాంపియన్స్ అయిన ముంబై ఇండియన్స్ మొదటి ఐదు మ్యాచ్ లు ఓడిపోయింది. ఆ తర్వాత వరసగా అన్ని మ్యాచులు గెలిచి సెమిస్ బర్త్ కంఫర్మ్ చేసుకుంది.
ఈసారి కరోనా ఉధృతిని దృష్టిలో ఉంచుకొని బీసీసీఐ ఐపీఎల్ ఫుల్ ప్లెడ్జ్ గా యూఏఈలో నిర్వహించబోతుంది.దానితో సోషల్ మీడియాలో 2014 నాటి సీజన్ కు ఇప్పటికీ ఉన్న సిమిలారిటీస్ ను గుర్తు చేస్తూ ఈ సీజన్ లో గెలిచేది తమ టీం అంటూ ప్రచార యుద్ధాలను మొదలుపెట్టారు మరీ ఈ సీజన్ లో ఎవరు గెలుస్తారని మీరు అనుకుంటున్నారు మాకు కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి.
End of Article