Home Sports Adda RCB నుండి “AB డివిలియర్స్” సడన్ గా తప్పుకోవడానికి కారణాలు ఇవేనా..?

RCB నుండి “AB డివిలియర్స్” సడన్ గా తప్పుకోవడానికి కారణాలు ఇవేనా..?

by Mohana Priya

సౌత్ ఆఫ్రికా క్రికెటర్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) విధ్వంసకర బ్యాట్స్‌మన్ ఏబీ డివిలియర్స్ ఇవాళ తన రిటైర్మెంట్ ని ప్రకటించారు. ఐపీఎల్ తో పాటు మిగిలిన అన్ని క్రికెట్ లీగ్ లకి కూడా ఏబీ డివిలియర్స్ గుడ్ బై చెప్పారు.

ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికిన ఏబీ డివిలియర్స్, కేవలం ఐపీఎల్ మాత్రమే ఆడుతున్నారు. గత కొన్ని సంవత్సరాల నుండి రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు తరఫున ఆడుతున్న ఏబీ డివిలియర్స్, ఈ ఏడాది ఐపీఎల్ లో మొదటి ఫేజ్ లో ఫర్వాలేదనిపించారు. కానీ తర్వాత ఒక యూఏఈ లో జరిగిన రెండవ ఫేజ్ ఐపీఎల్ లో మాత్రం అభిమానులని నిరాశ పరిచారు. అయితే ఏబీ డివిలియర్స్ ఐపీఎల్ నుండి రిటైర్మెంట్ ప్రకటించడానికి కారణాలు ఇవే అనే ప్రచారం జరుగుతున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.

reason behind abd announcing his retirement from ipl

# వచ్చే సంవత్సరం ఐపీఎల్ మెగా ఆక్షన్ ఉంటుంది. ఇందులో ఒక జట్టు యాజమాన్యం 4 ప్లేయర్లని రిటైన్ చేసుకోవచ్చు. ఏబీ డివిలియర్స్ కి ఇప్పుడు 37 సంవత్సరాలు. దాంతో ఐపీఎల్ నుండి రిటైర్మెంట్ ప్రకటించడానికి వయసు కూడా ఒక కారణం అని అంటున్నారు.reason behind abd announcing his retirement from ipl

# మరొక విషయం ఏంటి అంటే, ఇప్పటికే విరాట్ కోహ్లీ కెప్టెన్సీ నుండి తప్పుకున్నారు. ఏబీ డివిలియర్స్, కోహ్లీ మధ్య ఉన్న స్నేహం గురించి అందరికీ తెలిసిందే. దాంతో విరాట్ కోహ్లీ తప్పుకోవడం వల్ల ఏబీ డివిలియర్స్ కూడా ఇలాంటి నిర్ణయం తీసుకున్నారా అనే వార్తలు వినిపిస్తున్నాయి.

reason behind abd announcing his retirement from ipl

You may also like