చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్ తెలుగు సినిమా ఇండస్ట్రీకి పిల్లర్స్ (స్తంభాలు) అని అంటారు. ఎన్టీ రామారావు గారు, ఏఎన్నార్ గారు, కృష్ణ గారు తెలుగు సినిమా ఇండస్ట్రీకి పునాది వేస్తే, చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్ తెలుగు సినిమా ఇండస్ట్రీకి జాతీయ వ్యాప్తంగా ఒక గుర్తింపును తీసుకొచ్చారు. వీళ్ళ నలుగురు దాదాపు ఒకే సమయంలో ఇండస్ట్రీలో అడుగు పెట్టారు.

Reason behind Balakrishna not featuring in advertisements

వీరు సినిమాలు, అలాగే సామాజిక సేవలో కూడా సమానంగా బాధ్యత వహిస్తారు. అయితే నాగార్జున, చిరంజీవి, వెంకటేష్ చేసిన ఒక పని మాత్రం బాలకృష్ణ చేయలేదు. అదే అడ్వర్టైజ్మెంట్స్ లో నటించడం. చిరంజీవి ఎన్నో అడ్వర్టైజ్మెంట్స్ లో నటించారు, నాగార్జున కూడా సౌత్ ఇండియా షాపింగ్ మాల్, కళ్యాణ్ జ్యువెలర్స్ తో పాటు ఇంకా కొన్ని అడ్వర్టైజ్మెంట్స్ లో నటించారు.

Reason behind Balakrishna not featuring in advertisements

వెంకటేష్ కూడా మనపురం గోల్డ్ లోన్ అడ్వర్టైజ్మెంట్స్ లో నటించారు. కానీ బాలకృష్ణ మాత్రం ఇన్ని సంవత్సరాల తన సినీ కెరీర్ లో ఒక్కసారి కూడా ఒక అడ్వర్టైజ్మెంట్ లో కూడా నటించలేదు. అలా అడ్వర్టైజ్మెంట్స్ లో నటించకపోవడానికి కారణం ఏంటో ఒక సందర్భంలో బాలకృష్ణ చెప్పారు.

Reason behind Balakrishna not featuring in advertisements

ఈ విషయం గురించి బాలకృష్ణ మాట్లాడుతూ, “అప్పట్లో నాన్న ఎన్టీఆర్ గారు ఎప్పుడూ తన ఇమేజ్ ని అడ్డం పెట్టుకొని సినిమా ప్రకటనల్లో నటించలేదు అని, కానీ ఎన్టీఆర్ గారిని తమ సొంత వారిగా భావించి ఆయన సినిమాల్లో నటించిన ఫోటోలని తమ వస్తువుల మీద వేసుకొని పబ్లిసిటీ చేసుకునేవాళ్లు” అని చెప్పారు.

Reason behind Balakrishna not featuring in advertisements

“నటులకి ఆ ఇమేజ్ ఇచ్చింది ప్రేక్షకులే అని, అందుకే ప్రేక్షకుల్ని మెప్పించే సినిమాలు చేసి వాళ్ళ అభిమానాన్ని పొందాలి కానీ, వారు ఇచ్చిన ఇమేజ్ ని స్వార్థం కోసం ఉపయోగించకూడదు అనేది నాన్న గారి అభిప్రాయం అని, తాను కూడా అదే బాటలో నడుస్తూ ఇప్పటివరకు ఎలాంటి వాణిజ్య ప్రకటనలలో నటించలేదు” అని అన్నారు బాలకృష్ణ.

Reason behind Balakrishna not featuring in advertisements

ఒకవేళ ఏదైనా ప్రకటనల్లో నటించడం వల్ల ప్రజలకు ఏమైనా మేలు జరుగుతుంది అంటే మాత్రం తప్పకుండా నటిస్తాను అని చెప్పారు బాలకృష్ణ. అంతే కానీ డబ్బుల కోసం మాత్రం చేయను అని, తనకి ఉన్నది సరిపోతుంది అని చెప్పారు.