Ads
కొన్ని సినిమాలు హిట్ అవ్వగానే ఎక్కడలేని పాపులారిటీ వచ్చేస్తుంది. కోట్లాది మంది అభిమాన గణం వచ్చేస్తూ ఉంటారు. అయితే.. అప్పటి వరకు సామాన్యంగా ఉండి ఒక్కసారిగా ఇంత స్టార్ డమ్ ను హ్యాండిల్ చేయడం అంత సాధ్యమైనదేమీ కాదు. అయితే ఇటువంటప్పుడే కొన్ని సార్లు సెలెబ్రిటీలు డ్రగ్స్ కి బానిస అవుతూ ఉంటారు.
Video Advertisement
అలాగే.. డ్రగ్స్ కి బానిస అవ్వడం వల్లే ఒకప్పుడు స్టార్ గా వెలుగొందిన నటుడు భాను చందర్ తన కెరీర్ ను పాడు చేసుకున్నారు. ఆ డ్రగ్స్ వల్లే తన కెరీర్ నాశనమైందని భాను చందర్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గతంతో పోల్చుకుంటే ఇప్పుడు పూర్తిగా అవకాశాలు తగ్గిపోయాయని చెప్పుకొచ్చారు. 1990 ల వరకు ఆయన హవా కొనసాగింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూ లో మాట్లాడిన భాను చందర్ పలు ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చారు. చెన్నై నుంచి ముంబై కి వెళ్లిన టైం లోనే తాను డ్రగ్స్ కి బానిస అయ్యానని చెప్పుకొచ్చారు. కుటుంబ సభ్యులు మొత్తుకున్నా వినలేదని.. చివరకి మా అమ్మ చేసిన ఒత్తిడితోనే చెన్నైకి వచ్చానని చెప్పుకొచ్చారు.
అయితే డ్రగ్స్ నుంచి బయటపడాలన్న ఉద్దేశ్యంతోనే మార్షల్ ఆర్ట్స్ లో చేరానని చెప్పుకొచ్చారు. అందులో బ్లాక్ బెల్ట్ కూడా సాధించానని చెప్పుకొచ్చారు. డ్రగ్స్ తీసుకున్న సమయంలో తాను ఎలాంటి ఆలోచనలను చేయలేకపోవడం వల్లే తన కెరీర్ పాడైందని చెప్పుకొచ్చారు. ఇంకా ఆయన తండ్రి గురించి మాట్లాడుతూ గిటార్ తప్ప అన్ని వాయిద్యాలు వాయించడంలో తన తండ్రి నేర్పరి అని చెప్పుకొచ్చారు. ఆయనకీ సంగీతం తప్ప మరో ప్రపంచం తెలియదని చెప్పుకొచ్చారు.
End of Article