“అంజి” ఫ్లాప్ వెనకాల సీక్రెట్ ఇదే..! దర్శకుడు చెపుతూనే ఉన్నా…చిరంజీవి వింటేగా.!

“అంజి” ఫ్లాప్ వెనకాల సీక్రెట్ ఇదే..! దర్శకుడు చెపుతూనే ఉన్నా…చిరంజీవి వింటేగా.!

by Megha Varna

Ads

కొన్ని సినిమాలు హిట్ ఫ్లాప్ అనే ఫలితంతో సంబంధం లేకుండా ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. అలాంటి సినిమాల్లో మెగాస్టార్ చిరంజీవి హీరోగా 2004 లో విడుదలైన అంజి సినిమా ఒకటి. కోడి రామకృష్ణ గారి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా అప్పట్లో ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది. అలాంటి గ్రాఫిక్స్ అప్పటివరకు తెలుగు సినిమాల్లో చాలా అరుదుగా చూశాం. సినిమా కాన్సెప్ట్ కూడా ప్రేక్షకులకు చాలా కొత్తగా అనిపించింది.

Video Advertisement

reason behind chiranjeevi anji flop

అందుకు తోడు మెగాస్టార్ చిరంజీవి నటన, మణిశర్మ సంగీతం ఈ సినిమాకి ప్లస్ పాయింట్స్ అయ్యాయి. ఈ సినిమాకి సంబంధించి ఒక ఆసక్తికరమైన విషయాన్ని ఒక ఇంటర్వ్యూలో కోడి రామకృష్ణ గారు చెప్పారు. ముందు నిర్మాత శ్యాంప్రసాద్ రెడ్డి గారు చిరంజీవితో ఒక మంచి గ్రాఫిక్స్ సినిమా చేద్దాం అని కోడి రామకృష్ణ గారితో అన్నారట.

reason behind chiranjeevi anji flop

అందుకు కోడి రామకృష్ణ గారు చిరంజీవి కమర్షియల్ స్టార్ కాబట్టి తన దగ్గర ఒక డబుల్ రోల్ హీరో పాత్ర ఉన్న స్టోరీ ఉంది అని, చిరంజీవితో ఆ సినిమా చేద్దామని అన్నారట. కానీ శ్యాంప్రసాద్ రెడ్డి గారు మాత్రం గ్రాఫిక్స్ ఓరియంటెడ్ సినిమానే చేద్దాం అని అన్నారు. ఈ విషయంపై చిరంజీవిని సంప్రదించి ఈ సినిమా కోసం తను ఒక కొత్త నటుడిలాగా కష్టపడాలి అని అన్నారట కోడి రామకృష్ణ గారు.

reason behind chiranjeevi anji flop

అందుకు చిరంజీవి పర్వాలేదు అని, అంతే కష్టపడతాను అని అన్నారట. దాంతో కోడి రామకృష్ణ గారు సోషియో ఫాంటసీ అయిన అంజి కథని  సిద్ధం చేశారు. మూవీ షూటింగ్ కి చాలా సమయం పట్టింది. ఆ మూవీ షూటింగ్ టైంలో చిరంజీవి ఇంకా కొన్ని సినిమాలు కూడా చేశారట. కేవలం ఒక్క క్లైమాక్స్ కోసమే రెండు సంవత్సరాలు పట్టింది.

reason behind chiranjeevi anji flop

ఆ రెండు సంవత్సరాలు సినిమా షూటింగ్ కోసం చిరంజీవి ఒకటే షర్ట్ వేసుకున్నారట. బాక్సాఫీస్ దగ్గర ఫలితం ఎలా ఉన్నా కూడా ఆ సినిమాకి సంబంధించిన ప్రతీ వారు ఇంత కష్టపడ్డారు కాబట్టి సినిమా విడుదల అయ్యి 17 సంవత్సరాలు అవుతున్నా కూడా తెలుగు ప్రేక్షకులకు అంజి సినిమా ఇప్పటికీ గుర్తుంది. ఎప్పటికీ గుర్తుంటుంది.

watch video :

 


End of Article

You may also like