“అదే చెన్నై కొంపముంచింది”…DC తో CSK మ్యాచ్ ఓడిపోవడానికి ప్రధాన కారణం ఇదే.!

“అదే చెన్నై కొంపముంచింది”…DC తో CSK మ్యాచ్ ఓడిపోవడానికి ప్రధాన కారణం ఇదే.!

by Mohana Priya

Ads

ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా శనివారం రాత్రి చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకి, ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకి మధ్య జరిగిన మ్యాచ్ లో ఏడు వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు విజయం సాధించింది. మ్యాచ్ లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఇన్నింగ్స్‌ని ప్రారంభించిన ఓపెనర్లు డుప్లెసిస్ (0), రుతురాజ్ గైక్వాడ్ (5) తక్కువ స్కోర్ కి అవుటయ్యారు.

Video Advertisement

మ్యాచ్ తర్వాత జరిగిన అవార్డుల కార్యక్రమంలో మహేంద్ర సింగ్ ధోనీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పిచ్ చాలా పేలవంగా ఉండటంతో మొదట బ్యాటింగ్ అనేది చాలా కష్టం అయ్యింది అని అన్నారు. ధోనీ మాట్లాడుతూ “మ్యాచ్ ప్రారంభం లోనే మాకు ఎదురు దెబ్బ తగిలింది. పిచ్ మీద తేమ కనబడింది. ఇది మొదట బ్యాటింగ్ చేసిన జట్టు మీద చాలా ప్రభావం చూపుతుంది.

trending memes on csk vs dc ipl 2021

పిచ్ మీద తేమ ఉండడం అనేది చేజింగ్ జట్టుకి ఒక ప్లస్ పాయింట్ అవుతుంది అనే విషయం అందరికీ తెలుసు. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ కి వెళ్తున్నప్పుడు నా మనసులో ఒకటే ఉంది. ఎన్ని వీలైతే అన్ని ఎక్కువ పరుగులు చేయాలి అని అనుకున్నాం. అలాగే మొదటి అరగంట చాలా జాగ్రత్తగా ఆడాలి అనుకున్నాం. అది కుదరలేదు.

reason behind csk losing against dc in ipl2021

మేము సాధ్యమైనన్ని ఎక్కువ పరుగులని బోర్డు మీద ఉంచాలి అని లక్ష్యంతోనే బ్యాటింగ్ చేశాం. ఇంకా 15 – 20 పరుగులు చేసి ఉంటే బాగుండేది. పిచ్ మీద తేమ ఉండడంతో ఆరంభంలో బాల్ గమనంపై అంచనా దొరకదు. బంతి ఆగుతూ వచ్చింది. దాంతో మ్యాచ్ ఆరంభంలోనే కీలక వికెట్లను చేజార్చుకున్నాం. అయినా కూడా మా బ్యాటర్స్ చాలా బాగా ఆడారు. బౌలింగ్ మాత్రం కొంచెం మెరుగు పడాలి.

reason behind csk losing against dc in ipl2021

బౌలర్లు ప్రత్యర్థికి బౌండరీలు ఇవ్వడమే లక్ష్యంగా బంతులు వేసినట్టు అనిపించింది. రాబోయే మ్యాచ్ లకు ఈ మ్యాచ్ ఒక గుణపాఠం. ఇలాంటి పిచ్ పై 200 పరుగులు ఉంటేనే గెలుస్తాం. ఢిల్లీ బౌలర్లు మంచి లైన్ అండ్ లెంత్ లో బాల్స్ వేశారు. ఇలాంటి పిచ్ పై ఏ బాల్స్ వేయాలో ఆ బాల్స్ వేసి సక్సెస్ అయ్యారు. మా ఓపెనర్ లకు ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు బౌలర్లు వేసిన బాల్స్ చాలా అద్భుతం” అని అన్నారు.


End of Article

You may also like