Ads
ఆర్ ఆర్ ఆర్ సక్సెస్ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ పాన్ ఇండియా స్టార్ అయిపోయారు. ఈ నేపథ్యం తారక్ వరుస ప్రాజెక్టులకు సైన్ చేసారు. కొరటాల శివ డైరెక్షన్ లో ఎన్టీఆర్ 30 వస్తున్న సినిమా వస్తున్న విషయం తెలిసిందే. దర్శకుడు కొరటాల శివతో ఒక బిగ్గెస్ట్ మాస్ ప్రాజెక్ట్ ని చేయబోతున్నాడు ఎన్టీఆర్.
Video Advertisement
కొరటాల స్నేహితుడు మిక్కిలినేని సుధాకర్ ఈ చిత్రాన్ని తన యువ సుధా ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మించబోతున్నాడు. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై కళ్యాణ్ రామ్ ఈ చిత్రానికి సమర్పకులుగా వ్యవహరించబోతున్నారు. అయితే ఈ ప్రాజెక్టు అనౌన్స్ చేసి 5 నెలలు పూర్తి కావస్తున్నప్పటికీ ఇంకా ఈ రెగ్యులర్ షూటింగ్ మొదలుకాలేదు. ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్ళడానికి రోజురోజుకు చాలా ఆలస్యం అవుతున్న విషయం తెలిసిందే. ఇందుకు చాలా కారణాలు ఉన్నాయి.
ఆచార్య ప్లాప్ నేపథ్యం లో ఈ సినిమా స్క్రిప్ట్ పకడ్బందీగా ఉండేలా ప్లాన్ చేస్తున్నారట కొరటాల శివ. అంతే కాకుండా ఈ ప్రాజెక్ట్ ను పాన్ ఇండియా లెవెల్లో స్టార్ట్ చేయడంతో కాస్టింగ్ సెలక్షన్ విషయంలో ఎక్కువ టైం తీసుకోవాల్సి వస్తుందట. కన్నడ నుండి నటి రుషికా రాజ్ తో పటు ఒక యంగ్ హీరోని, అలాగే మలయాళం నుండీ అపర్ణ బాలమురళిని తీసుకోవాలని భావిస్తున్నారు. దీంతో కాస్టింగ్ విషయం కారణంగానే ఈ చిత్రం ఇంకా సెట్స్ పైకి వెళ్లలేదని తెలుస్తోంది.
ఎన్టీఆర్ బర్త్ డే కానుకగా వచ్చిన ఒక మాస్ మోషన్ పోస్టర్ గ్లింప్స్ అందర్నీ ఆకట్టుకుంది. ఎన్టీఆర్ అభిమానుల్లో ఈ సినిమాపై ఓ రేంజ్ లో హైప్ ని ఇచ్చింది. దీంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని నందమూరి ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
End of Article