ప్రతి బుధవారం ఈ టీవీ లో టెలికాస్ట్ అవుతూ టాప్ టీఆర్పీ తో దూసుకుపోతున్న డాన్స్ షో ఢీ. అయితే, గత కొంత కాలంగా శేఖర్ మాస్టర్ ఈ ప్రోగ్రాం లో కనిపించడం లేదు. దాంతో శేఖర్ మాస్టర్ ప్లేస్ లో గణేష్ మాస్టర్ వస్తున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా శేఖర్ మాస్టర్ ఢీ ప్రోగ్రాం లో ఉన్నారు. ఇప్పుడు సడన్ గా కనిపించకపోతే చాలా మంది ప్రేక్షకులకి, “శేఖర్ మాస్టర్ కి ఏమైంది? ఎందుకు షో లో రావట్లేదు?” అని అనిపించింది.

మరొకవైపు శేఖర్ మాస్టర్ మా టీవీ లో టెలికాస్ట్ అయ్యే కామెడీ స్టార్స్ ప్రోగ్రాం కి జడ్జ్ గా వస్తున్నారు. అయితే, శేఖర్ మాస్టర్ ఢీ ప్రోగ్రాం నుండి తప్పుకోవడానికి కారణం ఇటీవల వెలుగులోకి వచ్చింది. న్యూస్ 18 తెలుగు కథనం ప్రకారం, శేఖర్ మాస్టర్ మల్లెమాల రూల్స్ బ్రేక్ చేశారట. సాధారణంగా ఒక షో లో ఉన్నప్పుడు వేరే ఛానల్ షో కి వెళ్ళకూడదు. కానీ శేఖర్ మాస్టర్ మాత్రం ఢీ లో ఉన్నప్పుడే కామెడీ స్టార్స్ ప్రోగ్రామ్ కి జడ్జిగా వ్యవహరించారు.

దాంతో మల్లెమాల ప్రొడక్షన్ శేఖర్ మాస్టర్ తో బాండ్ ముగించాల్సి వచ్చింది. అయితే, ఇంకొక విషయం ఏంటంటే, శేఖర్ మాస్టర్ వేరే ఛానల్ లో షో ఎప్పుడైతే మానేస్తారో, వెంటనే వచ్చి మళ్ళీ ఢీ లో కొనసాగవచ్చట. ఈ విషయాన్ని ఒకప్పుడు జబర్దస్త్ కమెడియన్ అయిన మహీధర్ తన యూట్యూబ్ ఛానల్ లో చెప్పారు.