హీరో ఆ తప్పులు చేసినా సమర్థిస్తున్నారు…ఈ 2 కారణాల వల్లేనా “యానిమల్” ని చాలామంది ద్వేషిస్తున్నారు.?

హీరో ఆ తప్పులు చేసినా సమర్థిస్తున్నారు…ఈ 2 కారణాల వల్లేనా “యానిమల్” ని చాలామంది ద్వేషిస్తున్నారు.?

by Mounika Singaluri

బాలీవుడ్ సూపర్ స్టార్ రణబీర్ కపూర్ రష్మిక మందన జంటగా టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లో వచ్చిన చిత్రం యానిమల్. ఈ చిత్రం ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం అయ్యింది. రికార్డు కలెక్షన్స్ తో దూసుకుపోతుంది. ఇప్పుడు ఎక్కడ చూసినా యానిమల్ గురించి మాట్లాడుకుంటున్నారు. సోషల్ మీడియాలో ఈ యానిమల్ సినిమా పాటలను, సీన్లను తెగ వైరల్ చేస్తున్నారు. రణబీర్ కపూర్ ని వైల్డ్ యానిమల్ గా చూపించడంలో సందీప్ రెడ్డి సక్సెస్ అయ్యాడు.

Video Advertisement

Animal movie review

ఈ సినిమాలో తండ్రీ కొడుకుల మధ్య వచ్చే ఎమోషనల్ సీన్స్ అందరినీ ఆకట్టుకున్నాయి. తండ్రి కోసం ఎంతవరకు అయినా వెళ్లే కొడుకు పాత్రలో రణబీర్ కపూర్ జీవించేసాడు. ఈ సినిమాకి సెన్సార్ బోర్డు ఏ సర్టిఫికెట్ ఇచ్చింది. అయినా కూడా చాలామంది లెక్క చేయకుండా యానిమల్ సినిమాపై ఉన్న క్రేజ్ తో సినిమాని చూశారు.

అయితే చాలామందికి యానిమల్ సినిమా నచ్చలేదు. కుటుంబంతో కలిసి చూసే విధంగా లేదంటూ విమర్శలు చేస్తున్నారు. అసలు యానిమల్ సినిమా నచ్చకపోవడానికి గల మెయిన్ కారణాలు ఏమిటంటే…

1. హీరో పాత్ర : పురుష అహంకారం…నీచమైన వాదన…వివాహేతర సంభందం

సినిమా మొత్తంలో మేల్ డామినేషన్ కనిపిస్తుంది. రణబీర్ కపూర్ ఎప్పుడు కూడా రష్మిక మీద ఆధిపత్యం చెలాయిస్తూ ఉంటాడు. ఇది సమాజం మీద చెడు ప్రభావం చూపించే అవకాశం ఉంది. అంతే కాదు సినిమాలో హీరో చాలాసార్లు నీచమైన వాదన చేస్తూ ఉంటాడు. తన భార్య పట్ల మాట్లాడే విధానం దానికి ఆమె మౌనంగా ఉండిపోవడం లాంటివి చూస్తుంటే ఇది స్పష్టంగా అర్థమవుతుంది. రణబీర్ పాత్ర వివాహేతర సంబంధానికి లోనై ఉంటుంది. ఇది తన తండ్రి మీద జరిగిన దాడిని బహిర్గతం చేసేందుకు మాత్రమే ఉపయోగపడింది.

Animal movie review

2. వయోలెన్స్ ఎక్కువగా ఉండడం:

యానిమల్ సినిమాలో మితిమీరిన వైలెన్స్ ఉంది. నరుక్కోవడం చంపుకోవడం ఇలా సినిమా మొత్తం దీనితోటి నిండిపోయింది.అంతే కాదు సినిమా కథ అంతా ఇద్దరు లీడర్లు మధ్య జరిగిన పోరు. ఇలాంటి కథ కొత్తేమి కాదు. ఎప్పటినుండో చూస్తూనే ఉన్నాము.

 


You may also like

Leave a Comment