ఆర్ఆర్ఆర్ లో ఈ సీన్ వెనుక ఇంత అర్ధం ఉందా..?

ఆర్ఆర్ఆర్ లో ఈ సీన్ వెనుక ఇంత అర్ధం ఉందా..?

by Mounika Singaluri

Ads

దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమా గురించి.. అది క్రియేట్ చేసిన రికార్డ్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చరిత్రలో ఎప్పుడు ఎక్కడ కలవని ఇద్దరు వీరులను కలిపి ఫిక్షనల్ స్టోరీ గా చూపించి ఆకట్టుకున్నారు జక్కన్న.

Video Advertisement

ఇక ఈ సినిమాలో రామ్ చరణ్, తారక్ ఇద్దరు తమ నటనతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేశారు. తాజాగా ఈ సినిమా గురించి ఓ ఇంట్రస్టింగ్ విషయం బయట పెట్టారు రాజమౌళి.

is there is a chance for rrr to oscars

ఈ సినిమాలో చాలా హైలైట్స్ ఉన్నాయి వాటిలో క్లైమాక్స్ లో వచ్చే షోల్డర్ ఫైట్ ఒకటి. అలానే ఒక బాబు చుట్టూ మంటలు వచ్చేస్తాయి. ఆ సీన్ కూడా చాలా బాగుంటుంది. ఓ బాబు చుట్టూ మాటలు వచ్చేస్తే ఆ బాబుని తారక్, చరణ్ ఇద్దరు కలిసి కాపాడతారు. అయితే అలా ఇద్దరు కలిసి ఆ బాబుని కాపాడే సీన్ వెనుక ఒక అర్ధం వుంది. అదేమిటో ఇప్పుడు చూద్దాం. ఆర్ఆర్ఆర్ సినిమా లో మనం చూసినట్లయితే ఒక బాబు చుట్టూ మంటలు ఉంటాయి.

ఆ బాబు నదిలో ఉంటాడు ఈ బాబుని కాపాడటానికి రామ్ చరణ్, ఎన్టీఆర్ కలిసి వచ్చి కాపాడడం జరుగుతుంది. అయితే ఈ సీన్ వెనక ఉండే అర్ధాన్ని రాజమౌళి చెప్పారు. నది లో ఉండే బాబు భారతీయుడు. అయితే భారతదేశాన్ని కాపాడడానికి భీమ్ మరియు రామ్ ఇద్దరూ కలిసి ఉంటేనే కాపాడడం కుదురుతుంది అని రాజమౌళి చెప్పారు ఈ ఉద్దేశంతో బాబుని కాపాడే సీను ఉంది. కానీ నిజానికి మామూలు సీన్ ఏమో అని మనం అంతా అనుకుంటూ ఉంటాము కానీ ఈ సీన్ వెనుక ఇంత అర్థం ఉంది.


End of Article

You may also like