Ads
ఎన్నో రోజులు వెయిట్ చేసిన తర్వాత కేజీఎఫ్ చాప్టర్-2 విడుదల అయ్యింది. కేజీఎఫ్ మొదటి భాగం ఎవరూ ఊహించనంత పెద్ద హిట్ అయ్యింది. మొదటి భాగం మొత్తంలో కూడా రాకీ భాయ్ ఎలా ఎదిగాడు అనేది చూపించారు. రెండవ భాగంలో మాత్రం రాకీ భాయ్ ఎదిగిన తర్వాత తాను ఎదుర్కొన్న సమస్యలు ఏంటి అనేది చూపించారు? మొదటి భాగంలాగానే ఈ సినిమా కూడా పవర్ ఫుల్ గా ఉంటుంది.
Video Advertisement
అసలు రాకీ భాయ్ ని జనాలు అందరూ అంత గుర్తు పెట్టుకునే అంతగా ఏం చేసాడు అనేది ఈ సినిమాలో చూపించారు. కానీ మొదటి భాగంతో పోలిస్తే ఈ సినిమాలో ఎమోషన్స్ కొంచెం తక్కువగా ఉన్నట్టు అనిపిస్తాయి.
ఈ సినిమాలో మనం గమనించే మరో విషయం ఏమిటంటే.. అందరికి గడ్డలు ఉంటాయి. హీరోల నుంచి మొదలుపెడితే విలన్లతో పాటు క్యారెక్టర్ ఆర్టిస్ట్ లకు కూడా భారీగా గడ్డాలు ఉండడం గమనించే ఉంటారు. అయితే.. అందరికీ ఇలా గడ్డాలు ఉండేలా చూసుకోవడం వెనుక పెద్ద కారణమే ఉందట. ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రశాంత్ నీల్ ఓ విషయం చెప్పుకొచ్చారు.
దాదాపు కెజిఎఫ్ లో నటించిన ప్రధాన పాత్రలు అన్నిటికి గడ్డం ఉండడం వెనుక పెద్ద కథే ఉందని ప్రశాంత్ నీల్ చెప్పుకొచ్చారు. కొంతమందిపై ఉన్న కోపంతోనే ఆ పాత్రలని అలా డిజైన్ చేసానని చెప్పుకొచ్చారు. తాను “ఉగ్రం” సినిమా చేసేటప్పుడు క్లీన్ షేవ్ తో ఉన్నానని.. అప్పుడు ఒకరు వచ్చి డైరెక్టర్ ఎవరు అని తననే అడిగారని.. ఆ తరువాత సినిమా రిలీజ్ అయినప్పుడు కూడా డైరెక్టర్ నువ్వేనా..? అంటూ అడిగేవారని.. అది కోపం తెప్పించేది చెప్పుకొచ్చారు. ఆ కోపం తోనే కెజిఎఫ్ లో అందరికి గడ్డాలు పెట్టించానని చెప్పుకొచ్చారు.
End of Article