Ads
ప్రముఖ సంగీత దర్శకుడు మాస్ట్రో ఇళయరాజా తన సంగీతంతో భారతదేశ వ్యాప్తంగా ఖ్యాతి గడించారు. ఇళయరాజా పాటంటే ఇప్పటికీ చెవి కోసుకుంటారు. ఇళయరాజా కుటుంబం అంతా సంగీతానికే అంకితం అయిపోయారు.
Video Advertisement
ఇళయరాజా కుమారులు కార్తీక్ రాజా,యువన్ శంకర్ రాజాలు సంగీత దర్శకులుగా రాణిస్తున్నారు. ఇళయరాజా కూతురు భవతారిణి కూడా ఇదే ఫీల్డ్ లో కొనసాగుతున్నారు. అయితే నిన్న ఇళయరాజా కూతురు భవతారిణి అకస్మాత్తుగా మరణించారు. ఈ వార్త విని యావత్తు సంగీత అభిమానులు అందరూ దిగ్భ్రాంతికి గురయ్యారు. అసలు ఇళయరాజా కూతురు చనిపోవడానికి కారణం ఏంటి…?
భవతారిణి నిన్న శ్రీలంకలో హాస్పిటల్లో మరణించారు. గత కొద్దిగ కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న భవతారిణి శ్రీలంక హాస్పిటల్లో చికిత్స పొందుతూ మరణించారు. ఇళయరాజా కూడా శ్రీలంకలో కాన్సర్ట్ నిమిత్తం తన ట్రూప్ తో శ్రీలంకలోనే ఉన్నారు. భవతారిణి మరణించడంతో సంగీత అభిమానులు సినీ ఇండస్ట్రీ వారు ఇళయరాజా కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
భవతారిణి కూడా తండ్రి లాగానే సంగీతంలో రాణించారు. పలు సినిమాలకు మ్యూజిక్ డైరెక్టర్ గా వర్క్ చేశారు అలాగే సింగర్ గా కూడా చాలా సినిమాల్లో పాటలు పాడారు. ఇక భవతారిణి తెలుగులో గుండెల్లో గోదావరి సినిమాలో ఒక పాట పాడారు. ఈ సినిమాకి ఇళయరాజా సంగీతం అందించడం విశేషం. తెలుగులో ఆమె మ్యూజిక్ డైరెక్టర్ పనిచేసిన చిత్రం అవును. ఈ చిత్రం 2003 సంవత్సరంలో వచ్చింది. ఇక అన్ని భాషల్లో కలిపి భవతారిణి 100కు పైగా పాటలు పాడారు. ఇక భవతారిణి భర్త శబరి రాజ్ అడ్వర్టైజింగ్ ఏజెన్సీలో పని చేస్తూ ఉంటారు.
End of Article