Ads
గత కొంత కాలం నుండి నాని ఎన్నో రకాల పాత్రలని చేస్తున్నారు. దాంతో నాని కామెడీ పాత్ర చేసి చాలా సంవత్సరాలు అయ్యింది. ఈ సినిమాలో నాని మళ్లీ కామెడీ ఎక్కువగా ఉన్న పాత్ర చేస్తున్నారు అని మనకు ముందే అర్థమయ్యింది. నానిని ఇలా చూడాలి అని ప్రేక్షకులు చాలా రోజుల నుండి ఎదురు చూస్తున్నారు. సినిమా టీజర్, ట్రైలర్ లో చూపించినట్టుగానే ఒక సింపుల్ స్టోరీ లైన్ మీద నడుస్తుంది. కానీ దర్శకుడు వివేక్ ఆత్రేయ ఆ సింపుల్ స్టోరీని కూడా ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే విధంగా చూపించారు.
Video Advertisement
ఫస్ట్ హాఫ్ మొత్తం కూడా పాత్రలని ప్రేక్షకులకి పరిచయం చేయడంలోనే అయిపోతుంది. అసలు కథ ఉండేది మాత్రం సెకండ్ హాఫ్ లోనే. నాని నటన చాలా నాచురల్ గా అనిపిస్తుంది.
అలాగే నానికి, నాని తండ్రి పాత్ర పోషించిన నరేష్ కి మధ్య వచ్చే సీన్స్ కూడా హైలైట్ గా అనిపిస్తాయి. ఇక నజ్రియా సంగతి చెప్పాల్సిన అవసరమే లేదు. తొలి తెలుగు సినిమా అయినప్పటికీ ఆమె ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయిపోతారు. ఒక మంచి కామెడీ సినిమా చూడాలి అనుకునే వారికి ఈ సినిమా నచ్చేస్తుంది. అయితే.. ఫుల్ స్పీడ్ లో సాగిపోయే సినిమాను ఎక్స్పెక్ట్ చేసి వెళ్తే మాత్రం కొంత నిరాశ పడాల్సి వస్తుంది. సినిమా చాలా బాగున్నప్పటికీ.. కొన్ని చోట నెగటివ్ టాక్ వినిపిస్తోంది. దానికి కారణమేంటో ఇప్పుడు చూద్దాం.
డైరెక్టర్ వివేక్ ఆత్రేయ ఈ సినిమా కోసం ఓ సింపుల్ స్టోరీ లైన్ ను రాసుకున్నారు. కానీ దానికోసం పర్ఫెక్ట్ స్క్రీన్ ప్లే రాసుకోవడం విషయంలో తడబడ్డారని అనిపిస్తుంది. కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు ప్రేక్షకులను పూర్తిగా ఆకట్టుకునే విధంగా ఉండవు. ఇక్కడే ప్రేక్షకులకు బోర్ కొట్టేస్తూ ఉంటుంది. ఇక మూడవ విషయం ఏంటంటే.. సినిమా నిడివి. ఈ సినిమా నిడివిని కొంతమేరకు తగ్గిస్తే సినిమా ఇంకా పర్ఫెక్ట్ గా అనిపించేదేమో. ఇవి చిన్న చిన్న మైనస్ లే. ఈ సినిమా ప్లస్ పాయింట్స్ తో పోలిస్తే వీటిని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరమే లేదు. ఓ మంచి కామెడీ ఎంటర్టైన్మెంట్ చూడాలనుకునే వారు, నాని స్టయిల్ ఫన్ ని ఎంజాయ్ చేయాలనుకునేవారికి ఈ సినిమా ఓ మంచి ఛాయిస్ అవుతుంది.
End of Article